AP Floods : ఏపీ వరదలు… ఇప్పటివరకు 30 మందికిపైగా మృతి - పంట నష్టం ఎంతంటే..?-more than 30 people died due to floods in andhrapradesh ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Floods : ఏపీ వరదలు… ఇప్పటివరకు 30 మందికిపైగా మృతి - పంట నష్టం ఎంతంటే..?

AP Floods : ఏపీ వరదలు… ఇప్పటివరకు 30 మందికిపైగా మృతి - పంట నష్టం ఎంతంటే..?

Sep 04, 2024, 10:56 PM IST Maheshwaram Mahendra Chary
Sep 04, 2024, 10:34 PM , IST

  • Andhrapradesh Floods 2024 : ఏపీలోని భారీ వర్షాలు, వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 32 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలోనే 23 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వరదలు అల్లకల్లోలం చేశాయి. ఓవైపు భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరగగా… మరోవైపు 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

(1 / 6)

 ఏపీలో వరదల కారణంగా ఇప్పటివరకు 32 మంది మృతి చెందారని ఏపీ సర్కార్ వెల్లడించారు.  ఎన్టీఆర్‌ జిల్లాలో 24 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు తెలిపింది. 

(2 / 6)

వరదల వల్ల 212 పశువులు, 60 వేల కోళ్లు మృతి చెందినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

(3 / 6)

1,69,370 ఎకరాల్లో పంటతో పాటు 18,424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఈ వరదల ఫలితంగా 2 లక్షల 34 వేల మంది రైతులు నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేసింది.

(4 / 6)

3973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని సర్కార్ తెలిపింది.  78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని వివరించింది.

(5 / 6)

మరోవైపు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ఝ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు