Moongdal Benefits: వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో పెసరపప్పు ఒకటి-moongdal benefits pesarapappu is one of the must eat foods in summer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Moongdal Benefits: Pesarapappu Is One Of The Must Eat Foods In Summer

Moongdal Benefits: వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో పెసరపప్పు ఒకటి

Apr 04, 2024, 02:58 PM IST Haritha Chappa
Apr 04, 2024, 02:58 PM , IST

వేసవిలో ఎండలు పెరిగిపోతున్నాయి. వేడిని తట్టుకోవాలంటే శరీరానికి చలువ చేసే ఆహారాలు తినాలి. పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో పెసరపప్పు ఒకటి. వేడిగా ఉండే వాతావరణంలో తేలికపాటి భోజనాలు చేయాలి. పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల తేలికగా జీర్ణం అవుతాయి.

(1 / 5)

పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో పెసరపప్పు ఒకటి. వేడిగా ఉండే వాతావరణంలో తేలికపాటి భోజనాలు చేయాలి. పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల తేలికగా జీర్ణం అవుతాయి.(Freepik)

వేసవిలో బరువు త్వరగా తగ్గుతారు. తేలికపాటి ఆహారం తినడం వల్ల బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి  పెసరపప్పును ఆహారంలో చేర్చుకోవచ్చు. రెండు రకాల పెసరపప్పు అందుబాటులో ఉంది.  ఒకటి పొట్టు తీసిన పెసరపప్పు, పొట్టు తీయని పెసరపప్పు.  ఈ పప్పులో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. పెసరపప్పు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఇది చాలా సహాయపడుతుంది.   

(2 / 5)

ఫైబర్ అధికంగా ఉండే పెసర పప్పు తేలికగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియలో పెసరపప్పు త్వరగా జీర్ణమవుతుంది కాబట్టి పొట్ట తేలికగా ఉంటుంది.

(3 / 5)

గుండెకు పెసరపప్పు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పెసరపప్పు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. దీనివల్ల పెసరపప్పు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

(4 / 5)

వేసవిలో చలువ చేసే ఆహారాలను తినడం చాలా ముఖ్యం.  ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం తగ్గుతుంది. డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెసరపప్పు తగ్గిస్తుంది.

(5 / 5)

ఇతర గ్యాలరీలు