మూల త్రికోణ యోగం: ఈ రాశుల వారికి అధికంగా అదృష్టం!-moola trikona rajyog lucky zodiac signs to get great luck and benefits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  మూల త్రికోణ యోగం: ఈ రాశుల వారికి అధికంగా అదృష్టం!

మూల త్రికోణ యోగం: ఈ రాశుల వారికి అధికంగా అదృష్టం!

Sep 24, 2024, 04:46 PM IST Chatakonda Krishna Prakash
Sep 24, 2024, 04:39 PM , IST

మూడు గ్రహాలు ముఖాముఖి రావడంతో మూల త్రికోణ యోగం ఏర్పడింది. దీనివల్ల ఐదు రాశుల వారికి ఎక్కువ అదృష్టం, ప్రయోజనాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇవే..

జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికలు రాశులపై ప్రభావాన్ని చూపిస్తాయి. సెప్టెంబర్ 23న కన్యారాశిలోకి బుధుడు ప్రవేశించాడు. శుక్రుడు తులారాశిలో, శని తన సొంత రాశి కుంభంలో సంచరిస్తున్నారు. ఈ తరుణంలో కన్యా రాశిలోకి బుధుడు అడుగుపెట్టాడు. ఈ క్రమంలో శుక్రుడు, శని, బుధుడు మూడు గ్రహాలు ఎదురెదురుగా ముఖాముఖి వచ్చాయి. త్రిభుజ కోణాన్ని ఏర్పరిచాయి. దీంతో మూల త్రికోణ యోగం ఏర్పడింది. కొన్ని రాశులపై ప్రత్యక్ష దృష్టి ఉంది. దీంతో  ఈ కారణంగా ఐదు రాశులకు ప్రయోజనకరంగా ఉంది. 

(1 / 6)

మేషం: ఈ యోగం వల్ల మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగవుతుంది. డబ్బు వల్ల నిలిచిన కొన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించొచ్చు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సానుకూల ఫలితాలు వస్తాయి. 

(2 / 6)

కన్య: ఈ యోగం ఉండే కాలంలో కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. డబ్బు ఎక్కువగా దక్కే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. 

(3 / 6)

తుల: త్రికోణ రాజయోగం.. తులా రాశి వారికి కలిసి వస్తుంది. కొత్త వ్యాపార ఆలోచనలు రావొచ్చు. వ్యాపారాల్లో లాభాలు, కొత్త ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో చేసే కొన్ని పనులు భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. 

(4 / 6)

కుంభం: ఈ యోగం కాలంలో కుంభ రాశి వారికి కలిసి వస్తుంది. చాలా కాలం చేస్తున్న కొన్ని పనులు, ప్రాజెక్టులు కొలిక్కి రావొచ్చు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో పురోగతి ఉండొచ్చు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది.

(5 / 6)

మీనం: మూల త్రికోణ యోగ కాలంలో మీనరాశి వారికి మేలు జరుగుతుంది. ఉద్యోగులకు వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడులపై మంచి రాబడి ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులు పూర్తవుతాయి. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారాన్ని అందించాం. వీటికి ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి కోసం, గ్రహాల వ్యక్తిగత ప్రభావాలను తెలుసుకునేందుకు సంబంధింత నిపుణులను సంప్రదించవచ్చు)

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు