(1 / 5)
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇచ్చే నెలవారీ పింఛనను రూ. 400 నుంచి రూ. 1,110కి పెంచుతున్నట్టు నితీశ్ కుమార్ ప్రకటించారు.
(2 / 5)
ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర సామాజిక భద్రత పింఛను పథకం కింద 1,09,69,255 మంది లబ్ధిపొందనున్నట్టు నితీశ్ కుమార్ వివరించారు.
(3 / 5)
"సామాజిక భద్రత పింఛను పథకం అమలయ్యే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇక నుంచి రూ.400కి బదులు రూ. 1,100 పెన్షన్ లభిస్తుందని చెప్పడం నాకు సంతోషంగా ఉంది. జులై నుంచి లబ్ధిదారులకు ఇది అమల్లోకి వస్తుంది. ప్రతి నెల 10వ తేదీన లబ్ధిదారులందరి ఖాతాలో ఈ డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకుంటాను. 1 కోటి 9 లక్షల 69 వేల మంది లబ్ధిదారులకు ఇది సాయం చేస్తుంది," అని నితీశ్ కుమార్ ట్వీట్ చేశారు.
(4 / 5)
ఈ ఏడాది చివరిలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన వెలువడింది. ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమిపై గెలిచేందుకు జేడీయూ- తన మిత్రపక్షం ఎన్డీఏ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
(HT_PRINT)(5 / 5)
రాష్ట్రంలోని జిల్లా పరిషద్ అధ్యక్షుల నెలవారీ అలొవెన్స్ని ఇటీవలే రూ. 20వేల నుంచి రూ.30వేలకు చేశారు నితీస్ కుమార్. జెడ్పీ ఉపాధ్యక్షుడి నెలవారీ అలొవెన్స్ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచారు.
(Pappi Sharma )ఇతర గ్యాలరీలు