Barroz OTT Streaming: మోహన్‍లాల్ ‘బరోజ్’ సినిమా స్ట్రీమింగ్ షురూ.. ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?-mohanlal starrer 150 crore budget movie barroz ott streaming started on disney plus hotstar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Barroz Ott Streaming: మోహన్‍లాల్ ‘బరోజ్’ సినిమా స్ట్రీమింగ్ షురూ.. ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?

Barroz OTT Streaming: మోహన్‍లాల్ ‘బరోజ్’ సినిమా స్ట్రీమింగ్ షురూ.. ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?

Published Jan 22, 2025 10:03 AM IST Chatakonda Krishna Prakash
Published Jan 22, 2025 10:03 AM IST

  • Barroz OTT Streaming: బరోజ్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. మోహన్‍లాల్ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో రిలీజైన నెలలోనే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఎక్కడ చూడొచ్చంటే..

మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్‍లాల్ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన ‘బరోజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. భారీ బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం గత డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కాగా.. అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా నేడు (జనవరి 22) ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. 

(1 / 5)

బరోజ్ చిత్రం నేడు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన సరిగ్గా నాలుగు వారాలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ.

(2 / 5)

బరోజ్ చిత్రం హాట్‍స్టార్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

(3 / 5)

సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ‘బరోజ్’.. మలయాళ ఇండస్ట్రీలో ఖరీదైన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంతోనే తొలిసారి దర్శకుడిగా మారారు మోహన్‍లాల్. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రూ.20కోట్ల కలెక్షన్ల మార్క్ కూడా దాటలేకపోయింది. 

(4 / 5)

ఓ పురాతన రహస్య నిధిని సంరక్షించడం, ఓ బాలిక చుట్టూ బరోజ్ సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో మోహన్‍లాల్‍ సహా మాయా రావ్, గురు సోమసుందరం, ఇగాసియో మటెయోస్ కీరోల్స్ చేశారు. ఈ మూవీని ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు