(1 / 5)
మోహన్ లాల్ థ్రిల్లర్స్ లో దృశ్యం సినిమాకు స్పెషల్ ప్లేస్ ఉంది. 2013లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అదరగొట్టింది. కూతురును ఏడిపించిన అబ్బాయి శవాన్ని మాయం చేసే తండ్రిగా మోహన్ లాల్ నటించారు. ఈ మూవీ జియో హాట్ స్టార్ లో ఉంది. ఈ కథతో తెలుగులో వెంకటేష్ హీరోగా సినిమా వచ్చింది.
(x)(2 / 5)
మోహన్ లాల్ అంధుడిగా నటించిన థ్రిల్లర్ మూవీ ఒప్పం. తెలుగులో కనుపాప పేరుతో వచ్చింది సినిమా. 2016లో వచ్చిన ఒప్పంలో ఓ మర్దర్ కేసులో ఇరుక్కోవడంతో పాటు, సైకో కిల్లర్ నుంచి చిన్నారిని కాపాడే పాత్రలో ఒదిగిపోయారు మోహన్ లాల్. ఒప్పం జియో హాట్ స్టార్ లో, కనుపాప ఏమో ప్రైమ్ వీడియోలో ఉంది.
(x)(3 / 5)
రేప్ కు గురైన అంధురాలైన యువతికి అండగా నిలిచే లాయర్ పాత్రలో అదరగొట్టారు మోహన్ లాల్. కోర్ట్ డ్రామా థ్రిల్లర్ గా వచ్చిన నేరు ఫ్యాన్స్ ను మెప్పించింది. ఈ మూవీ తెలుగులోనూ జియో హాట్ స్టార్ లో ఉంది.
(x)(4 / 5)
పొలిటికల్ డ్రామా థ్రిల్లర్ లూసిఫర్ లో మోహన్ లాల్ యాక్టింగ్ వేరే లెవెల్. ఆయన స్వాగ్ అదిరిపోయింది. 2019లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రైమ్ వీడియోలో ఉందీ సినిమా. ఈ సినిమాను తెలుగులో చిరంజీవితో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు.
(x)(5 / 5)
మలయాళ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ తుడరుమ్ మూవీ. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ థ్రిల్లర్ మూవీ కలెక్షన్ల రికార్డు నెలకొల్పింది. మలయాళ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమా త్వరలోనే జియో హాట్ స్టార్ ఓటీటీలోకి రాబోతుంది.
(x)ఇతర గ్యాలరీలు