Single Character Movies: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన సింగిల్ క్యారెక్టర్ థ్రిల్లర్ మూవీస్ ఇవే!
సింగిల్ క్యారెక్టర్‌తో ప్రయోగాత్మకంగా తెలుగు, తమిళంతో పాటు మలయాళ భాషల్లో రూపొందిన కొన్ని సినిమాలు ఓటీటీ ఆడియెన్స్‌ను థ్రిల్ చేశాయి. ఈ సింగిల్ క్యారెక్టర్ మూవీస్‌ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
(1 / 5)
సింగిల్ క్యారెక్టర్‌తో హన్సిక చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 105 మినిట్స్ ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ అదృశ్య శక్తి కారణంగా తన ఇంట్లోనే బందీగా మారిన యువతి ఎలా తప్పించుకుందనే పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కింది.
(2 / 5)
మోహన్‌లాల్ సింగిల్ క్యారెక్టర్‌లో కనిపించిన మలయాళం మూవీ ఎలోన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. లాక్‌డౌన్ టైమ్‌లో హరిదాస్ అనే వ్యక్తి కొత్త ఫ్లాట్‌లోకి దిగుతాడు. ఆ ఫ్లాట్‌లోని ఆత్మల కారణంగా హరిదాస్ పడే ఇబ్బందులతో హారర్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది.
(3 / 5)
సింగిల్ క్యారెక్టర్‌తో రూపొందిన తెలుగు మూవీ హలో మీరా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. మీరా అనే యువతికి రోడ్ జర్నీలో ఎదురైన అనూహ్య పరిణామాలతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది.
(4 / 5)
నిత్యామీనన్ సింగిల్ క్యారెక్టర్‌తో ప్రయోగాత్మకంగా చేసిన మలయాళం మూవీ ప్రాణ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ మూవీకి వీకే ప్రకాష్ దర్శకత్వం వహించాడు.
ఇతర గ్యాలరీలు