(1 / 6)
ఇంగ్లండ్ తో బర్మింగ్‌హామ్ లో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇండియాకు 180 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 407 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీశాడు.
(Action Images via Reuters)(2 / 6)
సిరాజ్ 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. ఆ జట్టులో ఏకంగా ఆరుగురు డకౌట్ కావడం విశేషం.
(Action Images via Reuters)(3 / 6)
ఇంగ్లండ్ ఒక దశలో 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ చెలరేగిపోయారు. ఇండియన్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఇద్దరూ కలిసి ఆరో వికెట్ కు ఏకంగా 303 పరుగులు జోడించారు.
(Action Images via Reuters)(4 / 6)
ఇంగ్లండ్ వికెట్ కీపర్ జేమీ స్మిత్ రెచ్చిపోయాడు. అతడు 204 బంతుల్లో 187 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 21 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. ఒక రకంగా అతడు వచ్చిన తర్వాతే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తీరే మారిపోయింది. అతడు ఎదురు దాడికి దిగడంతో టీమిండియా బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోయారు. దీంతో ఇంగ్లండ్ అంత భారీ స్కోరు చేయగలిగింది.
(AP)(5 / 6)
హ్యారీ బ్రూక్ కూడా భారీ సెంచరీ చేశాడు. అతడు 234 బంతుల్లో 158 రన్స్ చేశాడు. 17 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఈ ఇద్దరూ కలిసి టీమిండియా కొంప ముంచారు. లేదంటే ఇండియన్ టీమ్ మరింత పటిష్ట స్థితిలో ఉండేదే.
(AFP)(6 / 6)
టీమిండియా బౌలర్లలో ఆకాశ్ దీప్ కూడా 4 వికెట్లు తీశాడు. సిరాజ్ 6, ఆకాశ్ 4 తీయడంతో మిగిలిన బౌలర్లకు కనీసం ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ప్రసిద్ధ్ కృష్ణ, జడేజా, సుందర్ లాంటి బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
(@BCCI X)ఇతర గ్యాలరీలు