Mohammed Shami: మహ్మద్ షమి మ్యాచ్ మోడ్ ఆన్.. టీమిండియాలోకి తిరిగి రావడానికి రెడీ అవుతున్న వీడియో వైరల్-mohammed shami match mode on team india pace bowler ready to make a comeback shared a video ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mohammed Shami: మహ్మద్ షమి మ్యాచ్ మోడ్ ఆన్.. టీమిండియాలోకి తిరిగి రావడానికి రెడీ అవుతున్న వీడియో వైరల్

Mohammed Shami: మహ్మద్ షమి మ్యాచ్ మోడ్ ఆన్.. టీమిండియాలోకి తిరిగి రావడానికి రెడీ అవుతున్న వీడియో వైరల్

Jan 18, 2025, 09:02 AM IST Hari Prasad S
Jan 18, 2025, 09:02 AM , IST

  • Mohammed Shami: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి టీమిండియాలోకి తిగిరి రావడానికి సిద్ధమయ్యాడు. 14 నెలల తర్వాత మళ్లీ వస్తుండటంతో అతడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేశాడు.

Mohammed Shami: మహ్మద్ షమి చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్ లో ఆడాడు.ఆ మెగా టోర్నీ ఫైనల్ తర్వాత గాయం కారణంగా మైదానానికి దూరమయ్యాడు. ఇప్పుడు 14 నెలల తర్వాత ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ కు అతన్ని ఎంపిక చేశారు. ఈ సిరీస్ కోసం సిద్ధమవుతూ అతడు తన షూస్ శుభ్రం చేసుకుంటున్న వీడియోను షేర్ చేశాడు.

(1 / 5)

Mohammed Shami: ఎదురు చూపులు ముగిశాయి.. మ్యాచ్ మోడ్ ఆన్.. టీమిండియాలోకి తిరిగి చేరడానికి సిద్ధమవుతున్నాను అనే క్యాప్షన్ తో తన దగ్గర ఉన్న షూస్ ను శుభ్రం చేసుకుంటున్న వీడియోను షమి పోస్ట్ చేశాడు.

(2 / 5)

Mohammed Shami: షమీ జాతీయ జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ క్రికెట్ మైదానానికి దూరంగా లేడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత బెంగాల్ టీమ్ జెర్సీలో మూడు ఫార్మాట్లలో దేశవాళీ క్రికెట్ ఆడి తన ఫామ్, ఫిట్నెస్ నిరూపించుకున్నాడు ఈ స్టార్ పేసర్. 

(3 / 5)

Mohammed Shami: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతోనే అతడు టీమిండియాలోకి తిరిగి వస్తాడని భావించినా.. సాధ్యం కాలేదు. ఇప్పుడు ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు. అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి ఎంపిక చేస్తారా లేదా అన్నది చూడాలి.

(4 / 5)

Mohammed Shami: గాయం నుంచి కోలుకున్న మహ్మద్ షమి బెంగాల్ తరఫున మూడు విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లలో మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో బెంగాల్ తరఫున 9 మ్యాచ్ లు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు షమీ బెంగాల్ తరఫున ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. 7 వికెట్లు తీశాడు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు