Telangana Cabinet : మంత్రివర్గంలోకి మహేందర్ రెడ్డి.. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం
- Telangana Cabinet Latest News: తెలంగాణ కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్‌రెడ్డి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు
- Telangana Cabinet Latest News: తెలంగాణ కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్‌రెడ్డి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు
(1 / 5)
తెలంగాణ కేబినెట్ లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి చోటు దక్కింది. మంత్రిగా గురువారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
(twitter)(2 / 5)
రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్‌రెడ్డి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రికేసీఆర్ హాజరయ్యారు.
(twitter)(3 / 5)
మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ తొలగింపుతో ఒక స్థానం ఖాళీగా ఉంది. అప్పట్నుంచి ఖాళీగా ఉండగా… తాజాగా మహేదంర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆయనకు కేటాయించే శాఖపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రకటన వెలువడలేదు.
(twitter)(4 / 5)
మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుని భర్తీ చేయాలని నిర్ణయించారు కేసీఆర్. ఇటీవలే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించగా… తాండూరు నుంచి పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం దక్కలేదు. ఈ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే కేటాయించారు.
(5 / 5)
తొలి కేబినెట్ లో కూడా రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు మహేందర్ రెడ్డి. గత ఎన్నికల్లో ఓటమిపాలుకాగా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ అవకాశమిచ్చారు. మహేందర్‌రెడ్డి తాండూర్ నియోజకవర్గం నుంచి 1994, 1999, 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. 2019, 2022లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మహేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
(twitter)ఇతర గ్యాలరీలు