(1 / 8)
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వరంలో హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి సుందరీమణులు హైదరాబాద్ చేరుకుంటున్నారు.
(2 / 8)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణలో అడుగుపెడుతున్నారు. స్థానిక కళాకారులతో సంప్రదాయ బద్ధంగా వారికి స్వాగతం చెబుతున్నారు.
(3 / 8)
ఇప్పటి వరకూ 65 మంది అందగత్తెలు హైదరాబాద్ చేరుకున్నారు. భాగ్యనగరంలో అడుగుపెడుతున్న సుందరీమణులకు తెలంగాణ ప్రభుత్వం సంప్రదాయబద్ధంగా స్వాగతం చెబుతోంది. పటిష్ట భద్రత కల్పిస్తుంది.
(4 / 8)
వివిధ దేశాల మిస్ వరల్డ్ పోటీ దారులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. వారికి అధికారులు, కళాకారులు ఘన స్వాగతం చెబుతున్నారు.
(5 / 8)
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ వెలుగులు విరజిమ్ముతుంది. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో నగరంలోని ప్రాంతాలను ముస్తాబు చేశారు. రాత్రిళ్లు వెలుగులు విరజిమ్మేలా లైటింగ్ ఏర్పాటు చేశారు.
(6 / 8)
మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా హైదరాబాద్ నగరం ముస్తాబు
(7 / 8)
మిస్ వరల్డ్ 2025 కోసం 120కి పైగా దేశాల అందగత్తెలు పోటీ పడుతున్నారు. 150 దేశాల్లో ఈ కార్యక్రమం ప్రసారం చేయనున్నారు.
ఇతర గ్యాలరీలు