(1 / 6)
హైదరాబాద్ ఆతిథ్యమిచ్చిన మిస్ వరల్డ్-2025 పోటీలు చివరి దశకు చేరుకుంటున్నాయి. మరో వారం రోజుల్లో చివరి పోటీలు జరగనున్నాయి. మే 31న మిస్ వరల్డ్ ఫైనల్స్ నిర్వహించనున్నారు.
(2 / 6)
మిస్ వరల్డ్ 2025 పోటీదారులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన పోచంపల్లి చేనేత వస్త్రంతో రూపొందించిన భారతీయ, పాశ్చాత్య డిజైన్ల అద్భుతమైన దుస్తుల్లో మెరిశారు.
(3 / 6)
హైదరాబాద్ ట్రైడెంట్ లో జరిగిన ఫ్యాషన్ షోలో భారతదేశ గొప్ప వస్త్ర వారసత్వాన్ని, తెలంగాణ సంప్రదాయ చేనేత కళను ప్రోత్సహించేలా మిస్ వరల్డ్ పోటీదారులు చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్ చేశారు.
(4 / 6)
పోచంపల్లి నమూనాలతో రూపొందించిన ఇండో-వెస్ట్రన్ ఎంసెంబుల్స్‌ను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ధరించారు.
(5 / 6)
తెలంగాణ చేనేత కళను, భారతీయ ఫ్యాషన్ గొప్పతనాన్ని ప్రతిబింబించే అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన దుస్తులతో మిస్ వరల్డ్ వేదికపై అందగత్తెలు మెరిశారు.
(6 / 6)
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. మిస్ వరల్డ్ పోటీదారులు ఇప్పటికే తెలంగాణ గొప్ప సంప్రదాయాలు, ఉత్సాహభరితమైన జీవనశైలిని గమనించారు.
ఇతర గ్యాలరీలు