AP Free Bus Scheme : మహిళలకు గుడ్ న్యూస్, ఫ్రీ బస్ పథకం అమలుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి అప్డేట్
AP Free Bus Scheme : ఏపీలో మహిళలకు ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఉచిత బస్సు పథకంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. మరో రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.
(1 / 6)
ఏపీలో మహిళలకు ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. మహిళలకు ఉచిత బస్సు పథకంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు.
(2 / 6)
మరో రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రేపు జరిగి కేబినెట్ సమావేశంలోనూ ఈ విషయం చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
(3 / 6)
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ ముందుకు దూసుకెళ్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం నాయుడుపేటలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు.
(4 / 6)
మరో రెండు నెలల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలవుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. మహిళలకు 3 ఉచిత సిలిండర్లు, 64 లక్షల మందికి 30వ తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
(5 / 6)
రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని మంత్రి తెలిపారు. వెనక్కి వెళ్లిన పరిశ్రమలన్నీ తిరిగి మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. శ్రీ సిటీని అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
ఇతర గ్యాలరీలు