తెలుగు న్యూస్ / ఫోటో /
Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్.. వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు!
- Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇన్నాళ్లు రేషన్ కార్డు ఉంటేనే ఇండ్లు మంజూరు చేస్తారని ప్రచారం జరిగింది. ఈ ఇష్యూపై మంత్రి పొంగులేటి స్పష్టత ఇచ్చారు. రేషన్ కార్డు లేకున్నా ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు.

(1 / 5)
రేషన్ కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు.. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
(2 / 5)
మొదటి విడతలో పేదలు, నిరుపేదల విభాగాలుగా పరిశీలించి ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించామని మంత్రి పొంగులేటి వివరించారు.
(3 / 5)
రెండో విడత నుంచి మాత్రం రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని ఇండ్లు మంజూరు చేస్తామని.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చిచెప్పారు.
(4 / 5)
తెలంగాణలో త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడించారు. గ్రామాల్లో వృద్ధాప్య, వితంతువులు, దివ్యాంగులు తదితర పింఛనుకు అర్హులను గుర్తించాలని అధికారులకు సూచించారు.
ఇతర గ్యాలరీలు