(1 / 7)
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి . మొదటి విడతలో లబ్ధిదారులుగా గుర్తించినవారు… నిర్మాణ పనులు చేస్తున్నారు. చాలాచోట్ల బేస్ మెంట్ వరకు పనులు పూర్తయ్యాయి,
(2 / 7)
ఇందులో భాగంగా బేస్‌మెంట్ వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు మొదటి విడతగా ప్రభుత్వం లక్ష రూపాయలు చెల్లించింది.ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.
(3 / 7)
వికారాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన పలువురు లబ్దిదారులకు లక్ష రూపాయల విలువైన చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. మొత్తం 2019 మంది ఖాతాల్లో రూ.లక్ష చొప్పున రూ.20.19 కోట్లను ఇవాళ లేదా రేపు జమ చేయనున్నారు
(4 / 7)
మొదటి విడత కార్యక్రమాన్ని జనవరి 26న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 70,122 మందికి ఇళ్లను మంజూరు చేశారు. వీరిలో కొంత వరకు లబ్ధిదారులు ముగ్గు పోసి పనులు కొనసాగిస్తున్నారు. కొత్తగూడెం, సిద్దిపేట, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో నెమ్మదిగా కొనసాగుతున్నాయి.
(5 / 7)
ఇదిలా ఉంటే డబ్బుల జమ ప్రక్రియకు సంబంధించి గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు పూర్తయితే లబ్ధిదారుడే ఫొటోలు నేరుగా అప్ లోడ్ చేయవచ్చని తెలిపారు. అధికారుల కోసం వేచి చూడకుండా… నేరుగా ఫొటో తీసి ఇందిమ్మ ఇళ్ల మొబైల్ యాప్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. అలా చేసిన వారి ఖాతాల్లో డబ్బులను జమ చేస్తామని ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
(6 / 7)
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పకుండా రెండు గదులు, ఒక వంటగది, బాత్ రూమ్ ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టాలని పేర్కొంది. ప్రతి దశలోనూ ఫొటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది.
ఇతర గ్యాలరీలు