ఇందిర‌మ్మ ఇండ్ల‌కు ఉచితంగా ఇసుక‌ - కూప‌న్ల పంపిణీ బాధ్య‌త‌ వారిదే...!-minister ponguleti announced that sand will be provided free of cost to indiramma houses ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఇందిర‌మ్మ ఇండ్ల‌కు ఉచితంగా ఇసుక‌ - కూప‌న్ల పంపిణీ బాధ్య‌త‌ వారిదే...!

ఇందిర‌మ్మ ఇండ్ల‌కు ఉచితంగా ఇసుక‌ - కూప‌న్ల పంపిణీ బాధ్య‌త‌ వారిదే...!

Published Jun 11, 2025 05:43 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 11, 2025 05:43 PM IST

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణానికి ల‌బ్దిదారుల‌కు ఉచితంగా ఇసుక స‌ర‌ఫరా చేస్తామ‌ని రాష్ట్ర హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి ప్రకటించారు. టోకెన్లకు సంబంధించి కూడా వివరాలను వెల్లడించారు.

రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల‌ నిర్మాణానికి ల‌బ్దిదారుల‌కు ఉచితంగా ఇసుక స‌ర‌ఫరా చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఉచిత ఇసుక కూప‌న్ల పంపిణీ  బాధ్య‌త‌ను జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

(1 / 7)

ములుగు జిల్లా ములుగు మండ‌లంలోని ఇంచెర్ల గ్రామంలో బుధ‌వారం మంత్రి సీత‌క్క‌తో క‌లిసి ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల‌కు మంజూరు ప‌త్రాల‌ను మంత్రి పొంగులేటి అంద‌జేశారు.

(2 / 7)

ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ…. ములుగు నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇళ్ల‌తో పాటు ఐటిడిఎ ప‌రిధి దృష్ట్యా మ‌రో 1500 ఇండ్లు మంజూరు చేశామ‌న్నారు. అయితే మంత్రి సీత‌క్క అభ్య‌ర్థ‌న‌ మేర‌కు మ‌రో 1000 ఇందిర‌మ్మ ఇళ్ల‌ను ప్ర‌త్యేకంగా మంజూరు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ల‌బ్దిదారులు మ‌రో 10-15 రోజుల్లో ఇళ్ల‌ నిర్మాణం ప్రారంభిస్తే ప్ర‌తి సోమ‌వారం వారికి నిధుల‌ను విడుద‌ల చేస్తామ‌న్నారు.

(3 / 7)

అదేవిధంగా ఈ ప్రాంతంలోని అట‌వీభూముల‌లో ఇంత‌వ‌ర‌కు చిన్న‌పాటి ఇంట్లో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల‌కు అక్క‌డే ఇందిర‌మ్మ ఇళ్లు క‌ట్టుకునే అవ‌కాశం క‌ల్పించాలంటూ అట‌వీ అధికారుల‌ను ఆదేశిస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు. అలాగే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు రాష్ట్రంలో చెంచుల‌కు ప్ర‌త్యేకంగా 10 వేల ఇళ్లు మంజూరు చేశామ‌ని తెలిపారు.

(4 / 7)

ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం అంటేనే ఇందిర‌మ్మ ఇళ్లు అని మంత్రి పొంగులేటి అభివ‌ర్ణించారు. గ‌తంలో 9 సంవ‌త్స‌రాల పాల‌న‌లో ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం పేద‌ల‌కు 25.50 ల‌క్ష‌ల ఇళ్లు ఇచ్చింద‌ని గుర్తుచేశారు. త‌ర్వాత వ‌చ్చిన బీఆర్ఎస్‌ ప్ర‌భుత్వం రెండు ద‌ఫాలు రాజ్య‌మేలినా కేవ‌లం 92 వేల ఇండ్ల‌కు ఆమోదం తెలిపి, 60 వేల ఇండ్ల‌ను మాత్ర‌మే పూర్తిచేసింద‌ని… అందులో 30 వేలకు పైగా  ఇళ్లు మొండిగోడ‌ల‌తో మిగిలిపోయాయ‌ని విమ‌ర్శించారు. క‌ట్టిన ఇళ్ల‌కుగాను కాంట్రాక్ట‌ర్ల‌కు కూడా డ‌బ్బు చెల్లించ‌లేద‌ని త‌ప్పుబ‌ట్టారు.

(5 / 7)

వ‌చ్చే నాలుగేళ్ల‌లో రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 20 ల‌క్ష‌ల ఇండ్ల నిర్మాణానికి సంక‌ల్పించామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.  రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను గ‌మ‌నించి…. రానున్న స్దానిక సంస్ధ‌ల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌వాల‌ని మంత్రి ప్రజలను కోరారు.

(6 / 7)

భూభార‌తికి సంబంధించి మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గ‌త  ప్ర‌భుత్వ హ‌యాంలో రైతులు అధికారుల చుట్టూ తిరిగినా వారి భూ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాలేద‌న్నారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వ‌స్తున్నార‌ని గుర్తు చేశారు.

(7 / 7)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు