రైతులకు శుభవార్త - 'రైతు భరోసా' నిధులు వచ్చేస్తున్నాయ్..! మీకోసమే ఈ అప్డేట్-minister ponguleti announced that rythu bharosa scheme funds will be released from june 16 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రైతులకు శుభవార్త - 'రైతు భరోసా' నిధులు వచ్చేస్తున్నాయ్..! మీకోసమే ఈ అప్డేట్

రైతులకు శుభవార్త - 'రైతు భరోసా' నిధులు వచ్చేస్తున్నాయ్..! మీకోసమే ఈ అప్డేట్

Published Jun 15, 2025 04:20 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 15, 2025 04:20 PM IST

రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పనుంది. జూన్ 16వ తేదీ నుంచే రైతు భరోసా స్కీమ్ నిధులను విడుదల చేయనుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఈసారి ముందుగానే వానాకాలం పంట పెట్టుబడి సాయం రైతులకు అందనుంది.

రైతు భరోసా స్కీమ్ నిధుల విడుదలకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. వానాకాలం సీజన్ కు సంబంధించిన పంట పెట్టుబడి సాయాన్ని ఈసారి ముందుగానే ఇవ్వనుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యాచరణను సిద్ధం చేసింది.

(1 / 8)

వానాకాలం సీజన్ రావటంతో రైతన్నలు ఇప్పటికే సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. సాగుబాటు చేస్తూ… విత్తనాలు నాటుతున్నారు. ఈ నేపథ్యంలో పంటపెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈసారి ముందుగానే నిధులను జమ చేయాలని నిర్ణయించింది.

(2 / 8)

జూన్ 16వ తేదీ నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. ఇదే విషయాన్ని తాజాగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… రైతు భరోసా ఇప్పటికే రెండు సార్లు ఇచ్చామన్నారు.  రేపటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు..

(3 / 8)

(image source .istockphoto.com)

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయిన ప్రభుత్వం రైతులను ప్రోత్సాహిస్తోందని మంత్రి పొంగులేటి చెప్పారు.  ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతులకు రూ.17000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో నే రూ 21000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు.నాణ్యమైన విత్తనాలు,ఎరువులు ఇబ్బంది లేకుండా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

(4 / 8)

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయిన ప్రభుత్వం రైతులను ప్రోత్సాహిస్తోందని మంత్రి పొంగులేటి చెప్పారు. 🌾ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతులకు రూ.17000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో నే రూ 21000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు.🌾నాణ్యమైన విత్తనాలు,ఎరువులు ఇబ్బంది లేకుండా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

(image source unsplash)

జూన్ 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొననున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం వేదికగా పలు జిల్లాల రైతులతో మాట్లాడనున్నారు. ఇదే సందర్భంగా రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది.

(5 / 8)

రైతు భరోసా స్కీమ్ ద్వారా అర్హులైన అన్నదాతలకు ఏడాదికి రూ. 12వేల సాయం అందిస్తారు. ఒక విడతలో రూ. 6 వేలు, మరో విడుతలో రూ. 6 వేలు జమ చేస్తారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే చేసిన ప్రభుత్వం… సాగు చేసే, వ్యవసాయ యోగత్య ఉన్న భూములకే రైతు భరోసా అందిస్తుంది.

(6 / 8)

మరోవైపు రైతు భరోసా స్కీమ్ కు సంబంధించి తెలంగాణ వ్యవసాయశాఖ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త దరఖాస్తులపై ప్రకటన చేసింది. 05-06-2025 లోపు భూ భారతి పోర్టల్ లో కొత్తగా నమోదైన రైతులు రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

(7 / 8)

(unsplash.com)

కొత్తగా అప్లికేషన్ చేసుకునేవాళ్లు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. వ్యవసాయశాఖ రూపొందించిన అప్లికేషన్ ఫారమ్ నింపి… మండలంలోని వ్యవసాయ అధికారులకు(వ్యవసాయ విస్తరణ అధికారికి ) అందజేయాల్సి ఉంటుంది.

(8 / 8)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు