Anna Canteens: మంగళగిరిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వ్యాప్తంగా 99చోట్ల ప్రారంభం-minister nara lokesh started anna canteen in mangalagiri 99 locations across the state ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Anna Canteens: మంగళగిరిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వ్యాప్తంగా 99చోట్ల ప్రారంభం

Anna Canteens: మంగళగిరిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వ్యాప్తంగా 99చోట్ల ప్రారంభం

Aug 16, 2024, 10:00 AM IST Sarath chandra.B
Aug 16, 2024, 10:00 AM , IST

  • Anna Canteens: ఆంధ్రప్రదేశ్‌‌లో రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లు శుక్రవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. మంగళగిరి నియోజక వర్గంలోని నులకపేటలో మంత్రి నారా లోకేష్ అన్నా క్యాంటీన్ ప్రారంభించారు.భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా క్యాంటీన్ల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా శాశ్వత నిధి ఏర్పాటు చేస్తామన్నారు. 

మంగళగిరి నియోజక వర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత స్థానికులతో కలిసి అల్పాహారం తీసుకుంటున్న మంత్రి నారా లోకేష్

(1 / 7)

స్థానిక టీడీపీ నాయకులతో కలిసి నులక పేటలో అన్నా క్యాంటీన్‌ను మంత్రి నాారా లోకేష్ ప్రారంభించారు. వైసీపీ కక్ష సాధింపు రాజకీయాలకు అన్నా క్యాంటీన్లు బలయ్యాయని లోకేష్ ఆరోపించారు. 

(2 / 7)

నులకపేటలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌లో ఉదయం అల్పాహారాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 

(3 / 7)

మంగళగిరిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను టీడీపీ నాయకులు, స్థానికులతో కలిసి లోకేష్‌ ప్రారంభించారు. రూ.15తో మూడు పూటల అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన భోజనం చేయొచ్చు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇస్కాన్‌ నిర్వహణలో ఉన్న సెల్ కిచెన్లలో తయారైన ఆహార పదార్ధాలను అన్నా క్యాంటీన్ల అందిస్తారు. తొలి విడతలో  100 క్యాంటీన్లను ప్రారంభించారు. సెప్టెంబర్ చివరి నాటికి 203 క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తారు. 

(4 / 7)

అన్నా క్యాంటీన్ల నిర్వహణకు విరివిగా విరాళాలు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. పేదల ఆకలి తీర్చే క్యాంటీన్లకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామని ప్రకటించారు. 

(5 / 7)

నులకపేటలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో లోకేష్ స్వయంగా వడ్డించారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. 

(6 / 7)

ఏపీలో అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5లకే నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం విక్రయిస్తారు. రూ.15కే మూడు పూటల భోజనం చేయవచ్చు. రోజుకు రూ.88ఖర్చయ్యే భోజనాన్ని రూ.15కే పేదలకు విక్రయిస్తారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ఇస్కాన్‌కు చెల్లిస్తుంది. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు