(1 / 6)
పౌరులకు ప్రభుత్వ సేవలు అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది.ఇప్పటికే వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే ఈ సేవలు అందుబాటులోకి కూడా వచ్చాయి.
(2 / 6)
పౌరులకు వివిధ సేవలను అందించడంలో మొదటి దశలో… ప్రభుత్వం ఇటీవల మెటా సహాయంతో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించింది. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 163 సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ఆధారంగా పౌరులు అనేక సేవలను పొందుతున్నారు.
(3 / 6)
ఇదిలా ఉంటే రేషన్ కార్డులపై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఏపీలోని పౌరులకు డిజిటల్ రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు. మంగళవారం జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా మంత్రి లోకేశ్ వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
(4 / 6)
క్యూఆర్ కోడ్ తోనే రేషన్ పొందే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఆ దిశగా ఐటీ శాఖ కృషి చేస్తోందని.. పౌరసరఫరాల శాఖతో చర్చించి... కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
(5 / 6)
రాష్ట్ర ప్రజలకు వాట్సాప్‌లోనే అన్ని ధృవపత్రాలు అందిస్తామని... అందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు వాట్సాప్ గవర్నెన్స్‌లో ఇంటిగ్రేటెడ్ కావాలని మంత్రి లోకేశ్ కోరారు. ఆర్టీజీఎస్‌లోని డేటా లేక్‌కు అనుసంధానం చేసి సహకరించాలని కోరారు.
(6 / 6)
డేట్ లేక్ రూపకల్పనలో భాగంగా పౌరసరఫరాల శాఖ సమాచారం కూడా అందుబాటులోకి వస్తే డిజిటల్ రేషన్ కార్డుల ప్రక్రియలో ముందడుగు పడే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలకు చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్ (సీడీటీవో)ను నియమించాలని ఐటీ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇతర గ్యాలరీలు