Shilpa Layout Flyover: శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ప్రారంభం… ప్రత్యేకతలివే-minister ktr inaugurated flyover from shilpa layout to outer ring road near gachibowli ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Minister Ktr Inaugurated Flyover From Shilpa Layout To Outer Ring Road Near Gachibowli

Shilpa Layout Flyover: శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ప్రారంభం… ప్రత్యేకతలివే

Nov 25, 2022, 06:37 PM IST HT Telugu Desk
Nov 25, 2022, 06:37 PM , IST

  • minister ktr inaugurated shilpa layout flyover: ఐటీ కారిడార్‌ను ORRతో అనుసంధానం చేస్తూ నిర్మించిన శిల్పా లేఅవుట్‌ మొదటి దశ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు నగర మేయర్ తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఐకియా మాల్‌ వెనక మొదలయ్యే ఈ ఫ్లైఓవర్‌ 30 అంతస్తుల ఎత్తైన భవనాల మధ్య నుంచి ORRపైకి చేరుతుంది. 2.8 కి.మీ. పొడవు.. 16 మీటర్ల వెడల్పుతో దాదాపు రూ. 250 కోట్ల వ్యయంతో శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తి చేశారు.

(1 / 5)

ఐకియా మాల్‌ వెనక మొదలయ్యే ఈ ఫ్లైఓవర్‌ 30 అంతస్తుల ఎత్తైన భవనాల మధ్య నుంచి ORRపైకి చేరుతుంది. 2.8 కి.మీ. పొడవు.. 16 మీటర్ల వెడల్పుతో దాదాపు రూ. 250 కోట్ల వ్యయంతో శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తి చేశారు.(twitter)

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.... విశ్వనగరంగా ఎదిగేందుకు అన్ని అవకాశాలు ఉన్న నగరం హైదరాబాద్‌ అని చెప్పారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌ భవిష్యత్‌ అవసరాలు, మౌలిక వసతులు.. ఇలా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సరైన ప్రణాళికలు ఉండాలనే ఉద్దేశంతోనే ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమాన్ని రూపొందించి జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ శాఖకు ముఖ్యమంత్రి అప్పగించారని చెప్పారు. దీనిలో భాగంగా చేపట్టిన 48 ప్రాజెక్టుల్లో ఈ ఫ్లైఓవర్‌తో కలిపి ఇప్పటివరకు ఆరేళ్లలో 33 ప్రాజెక్టులను పూర్తి చేశామని వెల్లడించారు.

(2 / 5)

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.... విశ్వనగరంగా ఎదిగేందుకు అన్ని అవకాశాలు ఉన్న నగరం హైదరాబాద్‌ అని చెప్పారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌ భవిష్యత్‌ అవసరాలు, మౌలిక వసతులు.. ఇలా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సరైన ప్రణాళికలు ఉండాలనే ఉద్దేశంతోనే ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమాన్ని రూపొందించి జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ శాఖకు ముఖ్యమంత్రి అప్పగించారని చెప్పారు. దీనిలో భాగంగా చేపట్టిన 48 ప్రాజెక్టుల్లో ఈ ఫ్లైఓవర్‌తో కలిపి ఇప్పటివరకు ఆరేళ్లలో 33 ప్రాజెక్టులను పూర్తి చేశామని వెల్లడించారు.(twitter)

ఒక్క ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమంలో భాగంగా రూ.8వేల కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇవి పూర్తయిన తర్వాత ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్‌-2ను చేపడతామని వెల్లడించారు. ఇందులో భాగంగా మరో రూ.3500 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టనున్నామని.. సీఆర్‌ఎంపీ అనే కార్యక్రమాన్ని తీసుకొని నగరంలో 710 కిలోమీటర్లకుపైగా మెయిన్‌ రోడ్లను ఎంత వర్షం పడ్డా దెబ్బతినకుండా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

(3 / 5)

ఒక్క ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమంలో భాగంగా రూ.8వేల కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇవి పూర్తయిన తర్వాత ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్‌-2ను చేపడతామని వెల్లడించారు. ఇందులో భాగంగా మరో రూ.3500 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టనున్నామని.. సీఆర్‌ఎంపీ అనే కార్యక్రమాన్ని తీసుకొని నగరంలో 710 కిలోమీటర్లకుపైగా మెయిన్‌ రోడ్లను ఎంత వర్షం పడ్డా దెబ్బతినకుండా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.(twitter)

మెట్రో రెండో దశకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రెండో దశలో భాగంగా బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు 26 కి.మీ., నాగోల్ నుంచి ఎల్బీనగర్‌ వరకు 5 కి.మీ, మైండ్‌ స్పేస్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు మరో 32 కి.మీ మేర చేపట్టనున్నామని ప్రకటించారు. మెట్రో విస్తరణకు కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నాం. వారు సహకరించినా.. లేకపోయినా.. మొదటి దశ మాదిరిగానే రెండో దశనూ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

(4 / 5)

మెట్రో రెండో దశకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రెండో దశలో భాగంగా బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు 26 కి.మీ., నాగోల్ నుంచి ఎల్బీనగర్‌ వరకు 5 కి.మీ, మైండ్‌ స్పేస్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు మరో 32 కి.మీ మేర చేపట్టనున్నామని ప్రకటించారు. మెట్రో విస్తరణకు కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నాం. వారు సహకరించినా.. లేకపోయినా.. మొదటి దశ మాదిరిగానే రెండో దశనూ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.(twitter)

ORR  నుంచి గచ్చిబౌలి పైవంతెన మీదుగా బొటానికల్‌ గార్డెన్‌ రోడ్డుపైకి నిర్మిస్తున్న శిల్పా లేఅవుట్‌ రెండోదశ ప్రాజెక్టు డిసెంబరు 2023 నాటికి పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

(5 / 5)

ORR  నుంచి గచ్చిబౌలి పైవంతెన మీదుగా బొటానికల్‌ గార్డెన్‌ రోడ్డుపైకి నిర్మిస్తున్న శిల్పా లేఅవుట్‌ రెండోదశ ప్రాజెక్టు డిసెంబరు 2023 నాటికి పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.(twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు