
(1 / 5)
దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం మలయాళం మూవీ డిటెక్టివ్ తెలుగులో సీబీఐ క్రైమ్ స్టోరీ పేరుతో రిలీజైంది. సురేష్ గోపి హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఫ్రీగా చూడొచ్చు. ఊహలకు అందని ట్విస్ట్‌లతో ఈ మూవీ సాగుతుంది.

(2 / 5)
పృథ్వీరాజ్ సుకుమారన్, శశికుమార్ హీరోలుగా నటించిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ మాస్టర్స్ తెలుగులో మరణ శాసనం పేరుతో యూట్యూబ్‌లో విడుదలైంది. బ్లాక్‌బస్టర్ మూవీ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో నాలుగున్నర మిలియన్ల వరకు వ్యూస్‌ను దక్కించుకున్నది.

(3 / 5)
మమ్ముట్టి హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ లాయర్ అరవింద్ యూట్యూబ్‌లో తెలుగులో అందుబాటులో ఉంది. కొరియన్ మూవీ ది క్లైంట్‌కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది.

(4 / 5)
కుంచకోబోబన్ హీరోగా నటించిన మిడ్‌నైట్ మర్డర్స్ యూట్యూబ్‌లో రెండున్నర మిలియన్లను సొంతం చేసుకున్నది. పోలీసులను టార్గెట్ చేసిన ఓ సైకో కథతో చివరి వరకు ఈ మూవీ థ్రిల్లింగ్‌గా సాగుతుంది.

(5 / 5)
మలయాళం మూవీ అల్లు రామేంద్రన్ తెలుగులో పంక్చర్ రామచంద్ర పేరుతో యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రైమ్ కామెడీ మూవీలో కుంచకోబోబన్, అపర్ణ బాలమురళి హీరోహీరోయిన్లుగా నటించారు.
ఇతర గ్యాలరీలు