(1 / 6)
బుధుడు మేష రాశిలో ప్రవేశించి జూన్ 8 వరకు ఈ స్థితిలో ఉంటాడు. చాలా సమయాల్లో బుధుడి క్షీణ దశ అశుభంగా పరిగణించినప్పటికీ కొన్ని రాశులకు చాలా శుభకరంగా ఉంటుంది.
(2 / 6)
బుధుడి ఈ దశ నాలుగు రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురానుంది. ఆ రాశులేంటో చూద్దాం.
(3 / 6)
సింహ రాశి: బుధుడి స్థానం సింహ రాశి జాతకులకు శుభదాయకం. ఈ రాశి వాళ్లు బయటి ప్రపంచం కంటే తనలో తాను చూడటానికి ప్రయత్నిస్తారు. వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మరింత ఆలోచనతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు.
(4 / 6)
వృశ్చిక రాశి : ఈ రాశి వారికి బుధుడి క్షీణ దశ సానుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో వీలైనంత తక్కువగా మాట్లాడాలి. సాధ్యమైనంతవరకు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వీళ్లకు ధన ప్రవాహం పెరుగుతుంది.
(5 / 6)
మకర రాశి: ఈ రాశి జాతకులకు బుధుడి స్థానం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇల్లు, కుటుంబం గురించి శుభవార్తలు అందుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిర్ణయాలపై గందరగోళం తొలగిపోతుంది. ఆస్తిని అమ్మడానికి లేదా అద్దెకు ఇవ్వడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వీళ్లకు కూడా ధన ప్రవాహం పెరుగుతుంది.
ఇతర గ్యాలరీలు