ఈవారంలోనే ఈ మూడు రాశుల వారికి మంచి సమయం స్టార్ట్.. డబ్బు, అదృష్టం ఎక్కువే!
- బుధుడి వల్ల ఈ వారంలో మూడు రాశులకు మంచి టైమ్ మొదలుకానుంది. వీరికి ధనం, గౌరవం లాంటి విషయాల్లో కలిసి వస్తుంది. అదృష్టం మద్దతుగా ఉంటుంది.
- బుధుడి వల్ల ఈ వారంలో మూడు రాశులకు మంచి టైమ్ మొదలుకానుంది. వీరికి ధనం, గౌరవం లాంటి విషయాల్లో కలిసి వస్తుంది. అదృష్టం మద్దతుగా ఉంటుంది.
(1 / 5)
జ్యోతిషం ప్రకారం, బుధుడికి ప్రాధాన్యత ఎక్కువ. బుధుడి కదలికలు రాశుల ఎఫెక్ట్ బాగా చూపిస్తాయి. బుధుడు ఈ వారంలోనే ఉదయించనున్నాడు.
(2 / 5)
దృక్ పంచాంగం ప్రకారం, ఈ శనివారం (ఫిబ్రవరి 22) సాయంత్రం 7.04 గంటలకు కుంభ రాశిలో బుధుడు ఉదయించనున్నాడు. మార్చి 18 వరకు ఈ స్థితి ఉండనుంది. ఈ కాలంలో మూడు రాశుల వారికి మంచి టైమ్ సాగనుంది.
(3 / 5)
మేషం: బుధుడు ఉదయించడం వల్ల మేష రాశి వారికి గుడ్‍టైమ్ మొదలవుతుంది. చాలా కాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా డబ్బుపరమైన విషయాల్లో ఎక్కువ కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. చాలా విషయాల్లో అదృష్టం వెన్నంటే ఉంటుంది.
(4 / 5)
సింహం: ఈ కాలంలో సింహ రాశి వారికి అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. తోబుట్టువులు, బంధువుల నుంచి సపోర్ట్ దక్కుతుంది. లక్ బాగుంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి.
(5 / 5)
వృశ్చికం: కుంభరాశిలో బుధుడు ఉదయించడం వృశ్చిక రాశి వారికి మేలు చేస్తుంది. ధన ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. కష్టాన్ని గుర్తింపు లభిస్తుంది. ఆస్తులు కొనాలనుకునే వారికి సానుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కలుగుతాయి. (గమనిక: విశ్వాసాలు, శాస్త్రాలను అనుసరించి ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాలను తీర్చుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు