తెలుగు న్యూస్ / ఫోటో /
నేటి నుంచి ఈ మూడు రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభం, ఆనందం, పురోగతి ఎక్కువగా..!
- బుధుడు నేడు (జనవరి 4) రాశి మారాడు. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం పెరిగింది. 20 రోజుల పాటు వీరికి చాలా విషయాల్లో కలిసి రానుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
- బుధుడు నేడు (జనవరి 4) రాశి మారాడు. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం పెరిగింది. 20 రోజుల పాటు వీరికి చాలా విషయాల్లో కలిసి రానుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
(1 / 5)
జ్యోతిషం ప్రకారం, బుధుడి సంచారం జనాల అదృష్టాలను మార్చేస్తుంటుంది. గ్రహాల రాకుమారుడైన బుధుడు నేడు (జనవరి 4) రాశి మారాడు. దీంతో 2025 తొలి వారం నుంచే కొన్ని రాశుల వారికి అదృష్టం షురూ అయింది.
(2 / 5)
బుధుడు నేటి (జనవరి 4, 2025) మధ్యాహ్నం 12.11 గంటల సమయంలో ధనూ (ధనస్సు) రాశిలోకి అడుగుపెట్టాడు. వృశ్చికాన్ని వీడాడు. జనవరి 24వ తేదీ సాయంత్రం వరకు ధనూ రాశిలో బుధుడు సంచరిస్తాడు. ఈ కాలంలో మూడు రాశుల వారికి అదృష్టం, ప్రయోజనాలు అధికంగా ఉంటాయి.
(3 / 5)
మిథునం: ధనూ రాశిలో బుధుడు సంచరించే కాలం మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మందికి ధన లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు పురోగతి ఉంటుంది. సహచరుల నుంచి మద్దతు పెరుగుతుంది.
(4 / 5)
మకరం: ఈ కాలంలో మకరరాశి వారి దశ తిరుగుతుంది. అదృష్టం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది. భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. కెరీర్లో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు ఆర్థికంగా సానుకూలంగా పరిస్థితులు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
(5 / 5)
మేషం: ధనూ రాశిలో బుధుడి సంచారం మేష రాశి వారికి లాభాలు తెచ్చిపెడుతుంది. పెండింగ్ పనులు చాలా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో ధనపరంగా లాభాలు ఎక్కువగా పొందే ఛాన్స్ మెండు. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. తోబుట్టువుల నుంచి ఎక్కువ పనుల్లో సపోర్ట్ ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ధృవీకరణ, ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)
ఇతర గ్యాలరీలు