Mercedes EQB review in pics: మూడు వరుసల సీటింగ్‍తో మర్సెడెస్ ఈక్యూబీ సిద్ధం.. ఎలా ఉందంటే!
- పాపులర్ బ్రాండ్ మెర్సిడెస్..ఎలక్ట్రిక్ వాహనాల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇండియాలో మెర్సిడెస్ ఈక్యూబీ ఎస్‍యూవీని లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ సంస్థ నుంచి వస్తున్న తొలి Three-row (మూడు వరుసల సీటింగ్) ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ఇదే.
- పాపులర్ బ్రాండ్ మెర్సిడెస్..ఎలక్ట్రిక్ వాహనాల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇండియాలో మెర్సిడెస్ ఈక్యూబీ ఎస్‍యూవీని లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ సంస్థ నుంచి వస్తున్న తొలి Three-row (మూడు వరుసల సీటింగ్) ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ఇదే.
(1 / 11)
ఇండియాలో తన రెండో ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని లాంచ్ చేసేందుకు మెర్సిడెస్ సిద్ధమైంది. మెర్సెడెజ్ ఈక్యూబీ అతిత్వరలో లాంచ్ కానుంది. ఆ కంపెనీ నుంచి వస్తున్న తొలి త్రీ-రో ఆల్ ఎలక్ట్రిక్ కార్ ఇదే.(HT Auto/Sabyasachi Dasgupta)
(2 / 11)
భారత మార్కెట్‍లోకి మెర్సెడెస్ ఈక్యూబీతో పాటు ఈక్యూసీ కూడా రానుంది. (HT Auto/Sabyasachi Dasgupta)
(3 / 11)
మెర్సెడెస్ జీఎల్‍బీ (కుడి)కి ఆల్ ఎలక్ట్రిక్ వెర్షనే ఈ ఈక్యూబీ. మెర్సెడెజ్ ఈక్యూబీతో పాటు అది కూడా లాంచ్ కానుంది. త్రీ-రోస్ సీటింగ్ స్పేస్ కోరుకుంటున్న కస్టమర్లే లక్ష్యంగా మెర్సెడెజ్ ఈ మోడళ్లను తీసుకొస్తోంది. (HT Auto/Sabyasachi Dasgupta)
(4 / 11)
స్టైలింగ్ పరంగా మెర్సెడెజ్ ఈక్యూబీ అత్యుత్తంగా ఉంది. ముందు భాగం క్లోజ్డ్ గ్రిల్‍తో రూపొందింది. దీని హెడ్‍లైట్ యూనిట్ల మధ్య లైట్ స్ట్రిప్ ఉంది. (HT Auto/Sabyasachi Dasgupta)
(5 / 11)
18 ఇంచుల అలాయ్ వీల్స్ తో వస్తోంది. జీఎల్‍బీ, జీఎల్‍సీ నిష్పత్తులు ఒకే రకంగా ఉంటాయి. (HT Auto/Sabyasachi Dasgupta)
(6 / 11)
వెనుక క్లీన్ ప్రొఫైల్‍ను మెర్సిడెజ్ ఈక్యూబీ కలిగి ఉంది. ఎల్ఈడీ టెయిల్ లైట్ల మధ్య లైట్ స్ట్రీప్ ఉంటుంది. (HT Auto/Sabyasachi Dasgupta)
(7 / 11)
మెర్సెడెస్ ఈక్యూబీ క్యాబిన్‍లో 10.1 ఇంచుల సైజ్ ఉండే రెండు స్క్రీన్‍లను కలిగి ఉంది. ఏసీ వెంట్లు, సీట్ కవర్స్ రోస్ గోల్డ్ షేడ్‍లో చూసేందుకు ఆకర్షణీయంగా ఉన్నాయి. (HT Auto/Sabyasachi Dasgupta)
(8 / 11)
ఈక్యూబీ లోపల ఉన్న రెండో వరుస సీట్లు సౌకర్యవంతంగా అనిపిస్తాయి. స్టోరేజ్ కోసం కావాలంటే సులువుగా మతవపెట్టవచ్చు. వెనుక వరుసలోనూ సీటింగ్ సౌకర్యవంతంగానే ఉంది.
(9 / 11)
చివరి వరుస సీట్లను దించితే.. దాదాపు 460 లీట్ల బూట్ స్పేస్ ఉంటుంది. మధ్య వరుస సీట్లు కూడా మడత పెడితే ఏకంగా 1,600 లీట్ల వరకు బూట్ స్పేస్ ఉంటుంది.
(10 / 11)
మెర్సెడెస్ ఈక్యూబీ ఎస్‍యూవీలో 66.5 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీ ఉంటుంది. ఈక్యూసీ (80 kWh) కంటే చిన్న బ్యాటరీతో వస్తోంది. కానీ ఈక్యూబీ 420 కిలోమీటర్ల రేంజ్‍ను ఇస్తుంది. (HT Auto/Sabyasachi Dasgupta)
ఇతర గ్యాలరీలు