మేఘాలయ మర్డర్​ కేసు- ఆ ఒక్క తప్పు వల్ల సోనమ్​, ఆమె లవర్​ దొరికిపోయారు!-meghalaya murder how one mistake by sonam her lover led to their arrest for raja raghuvanshi death ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మేఘాలయ మర్డర్​ కేసు- ఆ ఒక్క తప్పు వల్ల సోనమ్​, ఆమె లవర్​ దొరికిపోయారు!

మేఘాలయ మర్డర్​ కేసు- ఆ ఒక్క తప్పు వల్ల సోనమ్​, ఆమె లవర్​ దొరికిపోయారు!

Updated Jun 10, 2025 01:00 PM IST Sharath Chitturi
Updated Jun 10, 2025 01:00 PM IST

రాజ రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. మేఘాలయలో హనీమూన్​కి వెళ్లిన రఘువంశీని, అతని భార్య కిల్లర్ల చేత చంపించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలు కీలక విషయాలు బయటపడ్డాయి.

మధ్యప్రదేశ్​కి చెందిన రాజ రఘువంశి, సోనమ్​లకు 2025 మే 11న వివాహం జరిగింది. అనంతరం వారు హనీమూన్​ కోసం మేఘాలయకు వెళ్లారు. కాగా మే 23న దంపతులు అదృశ్యమయ్యారు. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు దర్యాప్తు చేపట్టినా చాలా రోజుల పాటు వారి ఆచూకీ లభించలేదు.

(1 / 5)

(ANI)

కాగా చిరాపుంజికి సమీపంలోని ఒక లోయలో జూన్​ 2న రాజ రఘువంశి మృతదేహాన్ని కుళ్లిపోయిన దశలో పోలీసులు గర్తించారు. అతడిని దారుణంగా హత్య చేశారని వారికి అర్థమైంది. కానీ సోనమ్​ ఎక్కడా కనిపించలేదు. ఆమెను ఎవరో కిడ్నాప్​ చేశారని పోలీసులు తొలుత భావించారు.

(2 / 5)

(HT_PRINT)

పోలీసుల దర్యాప్తులో వారికి ఒక కొడవలి కనిపించింది. ఆ కొడవలితోనే రాజ రఘువంశి హత్య జరిగిందని వారికి తెలిసింది. అయితే, ఆ రకమైన కొడవలి మేఘాలయలో పెద్దగా వాడరు! అప్పుడు పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. బయటి వ్యక్తులు ఈ పని చేసుంటారని వారు భావించారు.

(3 / 5)

(ANI - X)

ఆ తర్వాత దంపతుల కాల్​ రికార్డులను పోలీసులు సేకరించారు. మర్డర్​కి కొన్ని రోజుల ముందు వరకు సోనమ్​ ఒక వ్యక్తితో మాటిమాటికి కాల్​లో మాట్లాడేది. అతని లొకేషన్​.. ఆ దంపతుల లొకేషన్​కి దగ్గరిలోనే ఉందని పోలీసులు తెలుసుకున్నారు.

(4 / 5)

పోలీసులకు సోనమ్​పై అనుమానాలు పెరిగాయి. ఇంతలో ఒక టూరిస్ట్​ గైడు రాజా రఘువంశి, సోనమ్​లు అదృశ్యమవ్వడానికి ఒక రోజు ముందు, వారిని మరో నలుగురితో కలిసి ఉండటాన్ని చూసినట్టు పోలీసులకు చెప్పాడు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్​ చేశారు. వారే కిల్లర్లని తర్వాత తెలిసింది. సోనమ్​ చెప్పడంతోనే రఘువంశిని చంపినట్టు వారు స్టేట్​మెంట్​ ఇచ్చారు. అలా ఈ పూర్తి వ్యవహారం బయటపడింది. సోనమ్​కు రాజ్​ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, అందుకే రాజ రఘువంశిని చంపినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ పూర్తి కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

(5 / 5)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు