(1 / 6)
ఏపీ ఎన్నికల్లో గెలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్…. సొంత అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా పవన్… చిరంజీవి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.
(2 / 6)
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి అన్నయ్య ఇంటికి తమ్ముడు పవన్ కల్యాణ్ వచ్చారు. పవన్‌ను హత్తుకుని చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు.
(3 / 6)
ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ కల్యాణ్ కు వదిన సురేఖ అభినందనలు తెలిపారు.
(4 / 6)
తమ్ముడు పవన్ కు మెగాస్టార్ చిరంజీవి పూలదండ వేసి సత్కరించారు.
(5 / 6)
పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజనోవా, తనయుడు అకిరా నందన్ తో కలిసి అన్నయ్య మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు అందరూ పూలు జల్లి స్వాగతం తెలిపారు. అన్నయ్యను చూడగానే పవన్ చిరంజీవి కాళ్లకు నమస్కరించాడు. చిరంజీవి ఆనందభాష్పాలతో పవన్ ని హత్తుకున్నాడు
(6 / 6)
పవన్ విక్టరీ సందర్భంగా… మెగా ఇంట్లో కేక్ కట్ చేశారు. దీనిపై హాట్స్ ఆఫ్ పవన్ అంటూ రాశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు