(1 / 6)
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. వరుసగా లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
(2 / 6)
Meenakshi Chaudhary: 1997 మార్చి 7న హర్యానాలోని పంచకులలో జన్మించింది మీనాక్షి చౌదరి. ఆమె తండ్రి పేరు పి.ఆర్. చౌదరి. ఆయన భారతీయ సైన్యంలో కర్నల్‌గా పనిచేశారు. మీనాక్షి చౌదరి పంజాబీ. చండీగఢ్‌లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్‌లో చదువుకుంది. ఆమె డెంటల్ డాక్టర్ కూడా.
(3 / 6)
Meenakshi Chaudhary: 2017లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో మిస్ IMA అవార్డును గెలుచుకుంది. 2018లో ఫెమినా మిస్ ఇండియాలో రన్నరప్‌గా నిలిచింది. అదే సంవత్సరం మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్‌లో మొదటి రన్నరప్‌గా నిలిచింది. ‘అవుట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. తరువాత ‘అప్‌స్టార్ట్స్’ అనే హిందీ సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టింది.
(4 / 6)
Meenakshi Chaudhary: ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. ఖిలాడీ, ‘హిట్ ది సెకండ్ కేస్’ వంటి తెలుగు సినిమాలలో నటించింది.
(5 / 6)
Meenakshi Chaudhary: 2023లో విజయ్ ఆంటోనీతో కలిసి ‘కొలై’ సినిమాలో నటించింది.ఆ తర్వాత ది గోట్ మూవీలోనూ కనిపించింది.
(6 / 6)
Meenakshi Chaudhary: ఈ మధ్యే సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన మీనాక్షి.. అనగనగా ఒక రాజు, విశ్వంభర సినిమాల్లో నటిస్తోంది.
ఇతర గ్యాలరీలు