Meenakshi Chaudhary: మహేశ్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్- కట్ చేస్తే చేతిలో 7 సినిమాలు- మీనాక్షి క్రేజ్ మాములుగా లేదుగా!
- Meenakshi Chaudhary Upcoming Movies: మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం మూవీలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన మీనాక్షి చౌదరి తర్వాత ఏడు సినిమాలతో సందడి చేయనుంది. ఈపాటికే ఐదు రిలీజ్ కాగా త్వరలో మరో రెండు సినిమాలతో అలరించడానికి రెడీగా ఉంది మీనాక్షి చౌదరి.
- Meenakshi Chaudhary Upcoming Movies: మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం మూవీలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన మీనాక్షి చౌదరి తర్వాత ఏడు సినిమాలతో సందడి చేయనుంది. ఈపాటికే ఐదు రిలీజ్ కాగా త్వరలో మరో రెండు సినిమాలతో అలరించడానికి రెడీగా ఉంది మీనాక్షి చౌదరి.
(1 / 6)
రవితేజ ఖిలాడీ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి తర్వాత అడవి శేష్ హిట్ ది సెకండ్ కేస్ మూవీతో మంచి హిట్ అందుకుంది.
(2 / 6)
హిట్ 2 తర్వాత పెద్దగా సినిమాలు చేయని మీనాక్షి చౌదరి సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం మూవీలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. మొదట మెయిన్ హీరోయిన్ అనుకున్న పూజా హెగ్డే స్థానంలోకి రెండో ప్లేస్‌లో సెలెక్ట్ చేసుకున్న శ్రీలీల వచ్చేయడంతో మహేశ్ బాబుకు మరదలిగా మీనాక్షి చౌదరి నటించింది.
(3 / 6)
గుంటూరు కారంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి లాంటి హీరోయిన్‌ను అంత చిన్న రోల్‌కు పరిమితం చేయడంపై ఆడియెన్స్, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేశారు.
అయితే, సెకండ్ హీరోయిన్‌గా చేసినప్పటికీ మీనాక్షి చౌదరి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. గుంటూరు కారం తర్వాత మీనాక్షి చౌదరి చేతిలో 7 సినిమాలు వచ్చి పడ్డాయి. వాటిలో ఇదివరకే ఐదు రిలీజ్ అయిపోయాయి.
(4 / 6)
గుంటూరు కారం తర్వాత మీనాక్షి చౌదరి తమిళంలో సింగపూర్ సెలూన్, దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చేయగా.. తెలుగులో 2024లో లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో లక్కీ భాస్కర్ సాలిడ్ హిట్ అందుకుంది.
(5 / 6)
ఇక ఈ ఏడాది 2025లో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో జనవరి 10న అలరించేందుకు సిద్ధంగా ఉంది మీనాక్షి చౌదరి. అలాగే, నవీన్ పొలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు మూవీలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి ఓకే అయింది. ఇటీవల దానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు.
ఇతర గ్యాలరీలు