Telugu OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే - కామెడీ సినిమాలే టాప్
ఈ వీక్ ఓటీటీలో ఎక్కువగా కామెడీ సినిమాలదే హవా కనిపిస్తోంది. హారర్, రొమాంటిక్ అంశాలతో కూడిన పలు కామెడీ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ సినిమాలు ఏవంటే?
(1 / 5)
సందీప్‌కిషన్ మజాకా మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. రావురమేష్, అన్షు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
(2 / 5)
ధనుష్ హీరోగా నటించిన హాలీవుడ్ మూవీ ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్ తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ అడ్వెంచర్ కామెడీ మూవీకి కెన్ స్కాట్ దర్శకత్వం వహించాడు. ఎరిన్ మోరియార్టీ, బెరెనిస్ బెజో ప్రధాన పాత్రలు పోషించారు.
(3 / 5)
జీవా, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన హారర్ మూవీ అగాత్య తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. ఈ హారర్ మూవీలో అర్జున్ కీలక పాత్ర పోషించాడు. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది.
(4 / 5)
మలయాళం రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీ మందాకిని సేమ్ టైటిల్‌తో తెలుగులో ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. ఈమూవీలో మలయాళ కమెడియన్ అల్తాఫ్ సలీమ్ హీరోగా నటించాడు.
ఇతర గ్యాలరీలు