(1 / 5)
అంతర్జాతీయ క్రికెట్లో ఆసీస్ తరపున అదరగొట్టే మ్యాక్స్ వెల్.. ఐపీఎల్ లో మాత్రం ఫెయిల్ అవుతాడనే విమర్శలున్నాయి. తిరిగి పంజాబ్ కింగ్స్ గూటికి చేరిన అతను ఈ సీజన్ తొలి మ్యాచ్ లో గోల్డెన్ డకౌటయ్యాడు. ఐపీఎల్ లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్ అతడే. 19 సార్లు సున్నాకే వెనుదిరిగాడు. 10 సార్లు గోల్డెన్ డకౌటయ్యాడు. ఐపీఎల్ లో మ్యాక్స్ వెల్ 130 ఇన్నింగ్స్ లు ఆడాడు.
(PTI)(2 / 5)
ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. దినేశ్ కార్తీక్ తో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్ లో ముంబయి తొలి మ్యాచ్ లో రోహిత్ డకౌటయ్యాడు. ఐపీఎల్ లో 253 ఇన్నింగ్స్ లాడిన రోహిత్ 18 సార్లు డకౌటయ్యాడు.
(PTI)(3 / 5)
రాయల్ ఛాలెంజర్స్ మాజీ ఆటగాడు, ప్రస్తుతం ఆ జట్టు మెంటార్ ఐపీఎల్ హిస్టరీలో 18 సార్లు డకౌటయ్యాడు. 8 సార్లు ఫస్ట్ బంతికే వికెట్ పారేసుకున్నాడు. దినేశ్ కార్తీక్ ఐపీఎల్ లో 234 ఇన్నింగ్స్ లు ఆడాడు.
(Surjeet Yadav)(4 / 5)
టీమిండియా మాజీ స్పిన్నర్ పియూష్ చావ్లా 16 సార్లు డకౌటయ్యాడు. ఐపీఎల్ లో పంజాబ్, కేకేఆర్, సీఎస్కే, ముంబయికి ఆడిన చావ్లా 92 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశాడు.
(x/mufaddal_vohra)ఇతర గ్యాలరీలు