(1 / 6)
తెలంగాణలోని రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం ఇస్తుండటంతో పోటెత్తున్నారు.
(2 / 6)
గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే… పట్టణ ప్రాంతాల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. సర్వర్ డౌన్ కావడంతో వేలిముద్రల నమోదులో జాప్యంతో పంపిణీ ఆలస్యమవుతోంది. దీంతో రేషన్ లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు.
(ఫైల్ ఫొటో)(3 / 6)
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం 7గంటల నుంచే షాపుల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు.
(ఫైల్ ఫొటో)(4 / 6)
ఉదయం, సాయంత్రం సమయాల్లో బియ్యం పంపిణీ చేస్తున్న రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. మూడు నెలలకు సంబంధించి రేషన్ ఇవ్వటంతో పాటు పైగా సన్నబియ్యం కావడంతో వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ఎగబడుతున్నారు.
(ఫైల్ ఫొటో)(5 / 6)
కేంద్రం ఆదేశాల నేపథ్యంలో జూన్, జులై, ఆగస్టు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. జూన్ 1 నుంచి బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.
(6 / 6)
తెలంగాణలోని కార్డుదారులకు ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తున్నారు. 2025 ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందజేస్తున్నారు. కాబట్టి మూడు నెలలకు సరిపడే రేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… ప్రతి మనిషిపై 18 కిలలో రేషన్ అందిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు