Korean Web Series: రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ కొరియన్ వెబ్‌సిరీస్‌లు ఇవే - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Korean Web Series: ఇటీవల డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన కొన్నిఇంట్రెస్టింగ్ కొరియన్ వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో రిలీజయ్యాయి. ఈ సిరీస్‌లు ఏ ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోన్నాయంటే?
(1 / 5)
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన కొరియన్ వెబ్‌సిరీస్ గుడ్‌బై ఎర్త్ ఏప్రిల్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతోంది. గ్రహ శకలం కారణంగా భూమికి ఏర్పడిన ముప్పు నేపథ్యంలో ఈ థ్రిల్లర్ సిరీస్ రూపొందనున్నట్లు సమాచారం.
(2 / 5)
కొరియన్ వెబ్‌సిరీస్ మ్యారేజ్ కాంట్రాక్ట్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు అమెజాన్ మినీ టీవీలో రిలీజైంది. కుటుంబ బాధ్యతల కారణంగా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్న ఓ జంట కథతో ఫ్యామిలీ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కింది.
(3 / 5)
ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన కొరియన్ వెబ్‌సిరీస్ మ్యారీ మై హజ్బెండ్ సీజన్ వన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెండు జంటల కథతో ఈ సిరీస్ రూపొందింది.
(4 / 5)
క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన కొరియన్ సిరీస్ బ్లడ్ ఫ్రీ డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తనకు శత్రువుల నుంచి ప్రాణహానీ ఉండటంతో ఓ కంపెనీ సీఈఓ రక్షణగా ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ను నియమించుకుంటాడు. ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఇన్వేస్టిగేషన్ చుట్టూ బ్లడ్ ఫ్రీ సిరీస్ సాగింది.
ఇతర గ్యాలరీలు