ఇక సులభంగా మ్యారేజ్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లు - మీసేవలో అప్లయ్ చేసుకోవచ్చు, ఇవిగో వివరాలు-marriage certificate application through meeseva in telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఇక సులభంగా మ్యారేజ్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లు - మీసేవలో అప్లయ్ చేసుకోవచ్చు, ఇవిగో వివరాలు

ఇక సులభంగా మ్యారేజ్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లు - మీసేవలో అప్లయ్ చేసుకోవచ్చు, ఇవిగో వివరాలు

Published Jul 02, 2025 05:01 PM IST Maheshwaram Mahendra Chary
Published Jul 02, 2025 05:01 PM IST

తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మీసేవా ద్వారా మరో రెండు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మ్యారేజ్ సర్టిఫికేట్ తో పాటు మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ ను మీసేవా ద్వారా పొందే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

డిజిటల్ గవర్నెన్స్‌లో తెలంగాణ సర్కార్ మరో అడుగు ముందుకేసింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో మీ-సేవా కేంద్రాల ద్వారా వివాహ రిజిస్ట్రేషన్‌తో పాటు భూముల మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

(1 / 6)

జూన్ 30వ తేదీ నుంచే ఈ 2 కొత్త సేవల కోసం స్లాట్ బుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. గతంలో మ్యారేజీ సర్టిఫికెట్ ను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్దకు వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ సమస్య లేకుండా నేరుగా మీసేవా ద్వారానే అప్లయ్ చేసుకోవచ్చు.

(2 / 6)

తాజా సేవల్లో భాగంగా…. మ్యారేజ్ సర్టిఫికేట్ పొందడానికి రూ. 200 రుసుముతో మీసేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వధూ వరుల మ్యారేజీ ఫోటోలు, ఆధార్ కార్డులు, వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ముగ్గురు సాక్షుల ఆధార్ వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. ఈ పత్రాలన్నీ అప్‌లోడ్ చేసి వాటిని పరిశీలించిన తర్వాత అధికారులు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.

(3 / 6)

మరోవైపు ల్యాండ్ మార్యెట్ వాల్యూకి సంబంధించిన సేవలను కూడా మీసేవా ద్వారా పొందవచ్చు. దరఖాస్తులో జిల్లా, గ్రామం వంటి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను సంబంధిత సబ్- రిజిస్ట్రార్ కార్యాలయం 24 గంటల్లోనే పరిశీలించి మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు.

(4 / 6)

మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లు మీసేవాలో అందుబాటులోకి రావటంతో రియల్ ఎస్టేట్ తో పాటు క్రయవిక్రయాలు జరిపే వారికి సులభంగా ఈ ధ్రువపత్రాన్ని పొందే అవకాశం లభించినట్లు అయింది.

(5 / 6)

ఇప్పటికే మీసేవా ద్వారా పలు సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా వచ్చిన ఈ రెండు కొత్త సేవలతో ప్రజలకు మరింత లబ్ధి చేకూరనుంది.

(6 / 6)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు