Telangana Agriculture : బంతి పూలు.. లాభాల సిరులు.. ఎకరానికి రూ.3 లక్షల ఆదాయం!
- Telangana Agriculture : తెలంగాణ రైతులు బంతిపూల సాగుతో లాభాల బాట పడుతున్నారు. ఎకరానికి దాదాపు రూ. 3 లక్షల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. మార్కెట్‌లో బంతిపూలకు డిమాండ్ ఉండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Telangana Agriculture : తెలంగాణ రైతులు బంతిపూల సాగుతో లాభాల బాట పడుతున్నారు. ఎకరానికి దాదాపు రూ. 3 లక్షల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. మార్కెట్‌లో బంతిపూలకు డిమాండ్ ఉండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
(1 / 5)
బంతి పూల సాగు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో రైతులు ఈ సాగుపై మక్కువ చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం ఉండటంతో ఆసక్తి కనబరుస్తున్నారు.
(istockphoto)(2 / 5)
బంతిపూల సాగుకు తెగుళ్లు, చీడపీడల బాధలు తక్కువేనని రైతులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజపల్లిలో ఎడ రమేశ్ ఎకరం భూమిలో, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్‌లో రైతు అంబాల కరుణాకర్ ఎకరంలో బంతి సాగు చేశారు.
(istockphoto)(3 / 5)
తెలంగాణలో దసరా, దీపావళి పండగల నేపథ్యంలో మార్కెట్లో ఆశించిన ధర లభిస్తోందని రైతులు అంటున్నారు. రాజపల్లికి చెందిన రమేశ్ తన మిత్రుడి సాయంతో గత జులైలో ఈస్ట్‌వెస్ట్ కంపెనీకి చెందిన బంతి విత్తనాన్ని బెంగళూరు నుంచి తెప్పించి నారు పోశారు. నారు పోసిన 25 రోజుల తర్వాత మొక్కలు నాటారు.
(istockphoto)(4 / 5)
మొక్కలు నాటిన 52 రోజులకు రెక్కల పురుగు నివారణకు పురుగు పిచికారీ చేశారు. మొత్తం నాలుగు కోతలు వస్తాయని రైతులు చెబుతున్నారు. మొదటి కోత బతుకమ్మ తొలి రోజు ముందు కోయగా.. టన్నున్నర దిగుబడి వచ్చింది. కిలో రూ.80 ధర పలికింది.
(istockphoto)ఇతర గ్యాలరీలు