టీచర్ల బదిలీలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - ఎస్జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌..!-manual counseling for sgts in andhrapradesh key details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  టీచర్ల బదిలీలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - ఎస్జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌..!

టీచర్ల బదిలీలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - ఎస్జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌..!

Published Jun 10, 2025 10:52 AM IST Maheshwaram Mahendra Chary
Published Jun 10, 2025 10:52 AM IST

ఉపాధ్యాయుల బదిలీల వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌జీటీ టీచర్ల బదిలీ ప్రక్రియలో మ్యాన్యువల్ విధానం అనుసరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు.

టీచర్ల బదిలీల వేళ ఏపీ సర్కార్  కీలక నిర్ణయం తీసుకుంది. సెకండరీ గ్రేడ్ టీచర్లు బదిలీ ప్రక్రియలో మ్యాన్యువల్ విధానం అనుసరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు.

(1 / 5)

పార్వతీపురం మన్యం జిల్లాలో నా క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం ప్రజా ప్రతినిధులు, టిడిపి ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్ తో ఎస్జీటీ కౌన్సిలింగ్‌పై చర్చించినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

(2 / 5)

ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు తెలియజేశారని మంత్రి లోకేశ్ తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు ఎస్జీటీలకు ఆన్ లైన్ కౌన్సిలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

(3 / 5)

ఉపాధ్యాయుల బదిలీలలో వెబ్ కౌన్సిలింగ్ బదులుగా మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఎస్టీజీలు గత కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు.  ఈ క్రమంలోనే ఆన్‌లైన్ విధానంలో కాకుండా ఎస్టీటీ కౌన్సిలింగ్ మ్యాన్యువల్ విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

(4 / 5)

ఎస్జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ రావటంతో… ఇవాళ తలపెట్టిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ ముట్టడిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది.

(5 / 5)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు