(1 / 5)
పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడాపోటీల్లో భారత స్టార్ షూటర్ మనూ భాకర్ మెరిశారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. నేడు (జూలై 28) ఫైనల్‍లో మూడో స్థానంలో నిలిచి మెడల్ సాధించారు. పారిస్ క్రీడల్లో భారత పతకాల ఖాతా తెరిచారు.
(AFP)(2 / 5)
ఒలింపిక్స్ షూటింగ్‍లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. అద్భుత ప్రదర్శనతో ఈ ఘనత దక్కించుకున్నారు.
(Team India-X)(3 / 5)
చరిత్రాత్మక పతకం సాధించాక మనూ భాకర్ మాట్లాడారు. భగవద్గీతలోని మాటలను తాను గుర్తు చేసుకున్నానని ఈ సందర్భంగా తెలిపారు.
(PTI)(4 / 5)
చేసే పనిపైనే దృష్టి సారించి కృషి చేయాలని, ఫలితం గురించి చింతించొద్దని భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడని, తాను ఆ మాటలనే గుర్తు చేసుకున్నానని మనూ భాకర్ అన్నారు. తాను భగవద్గీత ఎక్కువగా చదువుతానని చెప్పారు.
(PTI)ఇతర గ్యాలరీలు