కృత్తిక నక్షత్రంలోకి కుజుడు: ఈ రాశుల వారికి ధనం, అదృష్టం!-mangal enters in kritika nakshatra will make many zodiac signs lucky and prosperous according to astrology ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కృత్తిక నక్షత్రంలోకి కుజుడు: ఈ రాశుల వారికి ధనం, అదృష్టం!

కృత్తిక నక్షత్రంలోకి కుజుడు: ఈ రాశుల వారికి ధనం, అదృష్టం!

Published Jul 09, 2024 03:02 PM IST Chatakonda Krishna Prakash
Published Jul 09, 2024 03:02 PM IST

Mars transit: కుజుడు (అంగారకుడు).. కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. ధనప్రాప్తితో పాటు మరికొన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారాలు చాలా ముఖ్యమైనవి. వీటి వల్ల అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. తాజాగా కుజుడు (అంగారకుడు).. కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించాడు. 

(1 / 5)

కృత్తిక నక్షత్రంలోకి జూలై 8వ తేదీన కుజుడు ప్రవేశించాడు. జూలై 26వ తేదీ వరకు అదే నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. కొన్ని లాభాలను పొందుతారు. 

(2 / 5)

వృషభం: ఈ సమయంలో వృషభ రాశి వారికి అదృష్టం ఉంటుంది. వీరికి అదనంగా డబ్బు, సంపద దక్కే అవకాశం ఉంటుంది. చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. కార్లు, ఆస్తులు కొనేందుకు మంచి సమయంగా ఉంటుంది. సానుకూల దృక్పథం పెరుగుతుంది. ధైర్యం, బలం పెరిగినట్టు ఆత్మవిశ్వాసం అధికమవుతుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత మెరుగవుతుంది. 

(3 / 5)

కన్య: కృత్తికలో కుజుడి సంచారం.. కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం చేసే వారికి ప్రశాంతత దక్కుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 

(4 / 5)

కుంభం: ఈ కాలంలో కుంభ రాశి వారికి కలిసి వస్తుంది. వీరికి వివిధ మార్గాల నుంచి లాభాలు చేకూరొచ్చు. ఆదాయం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆదా చేసే మార్గాలను వెతుకుతారు. ఏదైనా ప్రాజెక్టులో ఉంటే దాని ద్వారా భారీగా లాభం వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరగటంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి సహకారం అధికమవుతుంది. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారాన్ని అందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది) 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు