Mamta Kulkarni: టాప్‌లెస్ ఫొటోతో సంచలనం రేపిన హీరోయిన్ ఇప్పుడో సన్యాసిని.. పేరు కూడా మార్చుకుంది
- Mamta Kulkarni: మమతా కులకర్ణి.. ఒకప్పుడు టాప్ లెస్ ఫొటోలు, రూ.2000 కోట్ల విలువైన డ్రగ్స్ కేసుతో సంచలనం రేపిన ఈ నటి ఇప్పుడో సన్యాసిని. కిన్నార్ అఖాడాలో మహామండలేశ్వరిగా ఆమె మారిపోయింది. తన పేరు కూడా మార్చుకుంది.
- Mamta Kulkarni: మమతా కులకర్ణి.. ఒకప్పుడు టాప్ లెస్ ఫొటోలు, రూ.2000 కోట్ల విలువైన డ్రగ్స్ కేసుతో సంచలనం రేపిన ఈ నటి ఇప్పుడో సన్యాసిని. కిన్నార్ అఖాడాలో మహామండలేశ్వరిగా ఆమె మారిపోయింది. తన పేరు కూడా మార్చుకుంది.
(1 / 6)
Mamta Kulkarni: మమతా కులకర్ణి గుర్తుందా? ఎప్పుడు 1990ల్లో రెండు తెలుగు సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో సంచలనం రేపింది. టాప్ లెస్ ఫొటో షూట్ తో కుర్రకారు మతి పోగొట్టింది. ఇప్పుడామె ఓ సన్యాసినిగా మారిపోయింది. శుక్రవారం (జనవరి 24) మహా కుంభమేళాలో పిండ ప్రదానం చేసిన తర్వాత ఆమె సన్యాసం తీసుకోవడం విశేషం.
(2 / 6)
Mamta Kulkarni: ఈ నెల 29న తాయ్ అమావాస్య సందర్భంగా నటి మమతా కులకర్ణి కాశీలో తర్పణం చేయనుంది. ఆమె ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో ఉంది.అక్కడ మహా కుంభమేళాలో ఆమె కాషాయ వస్త్రాల్లో కనిపించి ఆశ్చర్యపరిచింది.
(3 / 6)
Mamta Kulkarni: ఒకప్పుడు తెలుగులో ప్రేమ శిఖరం, దొంగాపోలీస్ లాంటి సినిమాల్లో మమతా కులకర్ణి నటించింది. 52 ఏళ్ల వయసులో ఇప్పుడామె సన్యాసం పుచ్చుకుంది. ప్రయాగ్ రాజ్ లోని కిన్నార్ అఖాడాలో ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠీని ఆమె కలిసింది. ఆమె మహామండలేశ్వరిగా మారనుందని ఆయనే మీడియాకు వెల్లడించారు. దీంతోపాటు మమతా పేరు ఇక నుంచి యామాయి మమతా నందగిరిగా మారనుంది.
(5 / 6)
Mamta Kulkarni: మమతా కులకర్ణి 1990వ దశకంలో బాలీవుడ్ లో ఓ ఊపు ఊపింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ లాంటి పెద్ద స్టార్ల సరసన నటించింది. కరణ్ అర్జున్, చైనా గేట్, బాజీ, క్రాంతివీర్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
ఇతర గ్యాలరీలు