(1 / 7)
మే 21న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 65వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అభిమానులు, స్నేహితుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
(Pranav Mohanlal fan club/X)(2 / 7)
దృశ్యం సహా తాను పోషించే కొన్ని పాత్రల మాదిరిగానే మోహన్ లాల్ కూడా కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తాడు. మోహన్ లాల్ కుటుంబంతో దిగిన ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో తల్లి, కూతురు ఇద్దరూ ఒకెేలా ఉన్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
(Pranav Mohanlal fan club/X)(3 / 7)
మోహన్ లాల్, ఆయన భార్య సుచిత్ర 1988లో వివాహం చేసుకున్నారు. వారు మూడు దశాబ్దాలకు పైగా కలిసి ఉన్నారు. మోహన్ లాల్ తన అభిమాని అయిన సుచిత్రనే వివాహం చేసుకోవడం విశేషం.
(Mohanlal/Instagram)(4 / 7)
మోహన్ లాల్ ప్రతినాయకుడిగా నటించినప్పుడు తనకు నచ్చలేదని, కానీ మరో సినిమాలో మోహన్ లాల్‌ను చూసినప్పుడు అది ప్రేమగా మారిందని సుచిత్ర తెలిపారు.
(Mohanlal/Instagram)(5 / 7)
మోహన్ లాల్ కంటే సుచిత్ర హైట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, భార్యకంటే హైట్ ఎక్కువ కనిపించేందుకు మోహన్ లాల్ హీల్స్ వాడతనని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు 37 ఏళ్ల తర్వాత కూడా మోహన్ లాల్ అలాగే వేసుకున్నట్లు తమ ప్రేమ వార్షికోత్సవాల్లో బహిరంగంగా చెబుతూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు.
(Mohanlal/Instagram)(6 / 7)
మోహన్ లాల్-సుచిత్ర జంటకు ఒక కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ ఉన్నాడు. ప్రణవ్ మోహన్ లాల్ కూడా హీరోగా మలయాళంలో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. హృదయం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ప్రణవ్ పర్సనల్ లైఫ్‌ను సీక్రెట్‌గా మెయింటేన్ చేస్తున్నాడు.
(Pranav Mohanlal fan club/X)(7 / 7)
మోహన్ లాల్‌కు ఒక కుమార్తె విస్మయ ఉంది. అయితే, మోహన్ లాల్‌లా నటనవైపు వెళ్లకుండా విస్మయ రచయితగా రాణిస్తోంది.
(Vismaya Mohanlal/Instagram)ఇతర గ్యాలరీలు