(1 / 7)
కోల్డ్ కేస్ 2021 లో విడుదలైన మలయాళ భాషా క్రైమ్ హారర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం. తనూ బాలక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
(2 / 7)
పూజా మోహన్రాజ్, అనిల్ నెడుమంగాడ, లక్ష్మీ ప్రియా చంద్రమౌళి, ఆనంద్, రాజేష్ హెబ్బార్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
(3 / 7)
ఐపీఎస్ అధికారి ఎం.సత్యజిత్ (పృథ్వీరాజ్), ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మేధా పద్మజ (అదితి) ఒకేసారి చేసిన రెండు మిస్టరీ మర్డర్ కేసుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
(4 / 7)
ఐపీఎస్ ఆఫీసర్, జర్నలిస్ట్ ఇద్దరూ విడివిడాగ దర్యాప్తు చేసుకుంటూ వచ్చి ఒకేచోటుకు వస్తారు. ఆ తర్వాతే పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. అనంతరం ఏం జరిగిందనే కోల్డ్ కేస్ సినిమా స్టోరీ.
(5 / 7)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కోల్డ్ కేస్ ఓటీటీలో నేరుగా విడుదలైంది. 2021 జూన్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో కోల్డ్ కేస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తెలుగు భాషలో కోల్డ్ కోస్ ఓటీటీ రిలీజ్ అయింది.
(6 / 7)
ఈ చిత్రంలో ఎక్కువ భాగం తిరువనంతపురంలో చిత్రీకరించారు. సుమారు 36 రోజుల పాటు కోల్డ్ కేస్ సినిమాను షూటింగ్ చేశారు. గిరీష్ గంగాధరన్, జోమన్ టి జాన్ కలిసి సినిమాటోగ్రఫీ చేశారు. సమీర్ మహమ్మద్ ఎడిటర్.
(7 / 7)
ఇక కోల్డ్ కేస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే కాకుండా యూట్యూబ్‌లో కూడా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. యూట్యూబ్‌లో తెలుగులో కోల్డ్ కేస్ మూవీని ఉచితంగా చూసేయొచ్చు. యూట్యూబ్ సెర్చ్ బాక్స్‌లో కోల్డ్ కేస్ మూవీ ఇన్ తెలుగు అని టైప్ చేస్తే తెలుగు ఫిల్మ్ నగర్ యూట్యూబ్ ఛానెల్‌లో సినిమా దర్శనం ఇస్తుంది. అందులో ఎంచక్కా ఈ సినిమాను చూసేయొచ్చు.
ఇతర గ్యాలరీలు