(1 / 5)
పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ లీడ్ రోల్స్ చేసిన తంగలాన్ సినిమా రిలీజ్‍కు రెడీ అయింది. ఈ పీరియడ్ యాక్షన్ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఎక్స్ (ట్విట్టర్)లో నేడు మాళవిక మోహనన్.. క్యూ అండ్ ఏ సెషన్ నిర్వహించారు. నెటిజన్లు ప్రశ్నలు అడగాలని కోరి.. కొన్నింటికి సమాధానాలు చెప్పారు.
(2 / 5)
విక్రమ్‍ను తొలిసారి కలిసినప్పుడు ఎలా అనిపించిందని, ఆయనతో నటించడం ఎలా ఉందని ఓ నెటిజన్ అడిగారు. దీనిపై మాళవిక స్పందించారు. విక్రమ్‍ను తొలిసారి కలిసినప్పుడు తనకు కాస్త భయంగా అనిపించిందని ఆమె సమాధానం ఇచ్చారు. తాను తొలిసారి స్టంట్స్ చేశానని తెలిపారు. విక్రమ్ అందరితో స్నేహపూర్వకంగా ఉంటారని చెప్పారు. ఆయన ఇతర నటీనటులకు చాలా సాయం చేస్తారని తెలిపారు. అద్భుతమైన కో-యాక్టర్ అని పేర్కొన్నారు. విక్రమ్‍పై తనకు చాలా గౌరవం ఉందని అన్నారు.
(3 / 5)
పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని మాళవిక మోహనన్‍ను ఓ నెటిజన్ క్వశ్చన్ చేశారు. “పెళ్లయిన వ్యక్తిగా నన్ను చూడాలని మీకు ఎందుకు తొందరగా ఉంది?” అని మాళవిక ఎదురు ప్రశ్న వేశారు.
(4 / 5)
తంగలాన్ గురించి ఒక్క మాటలో చెప్పండని అడుగగా.. ‘మ్యాడ్‍నెస్’ అని మాళవిక స్పందించారు. తన తదుపరి చిత్రం అనౌన్స్‌మెంట్ త్వరలో వస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
(5 / 5)
ఇప్పటి వరకు చేయని ఏ పాత్ర అయినా పోషించాలని ఉందా? అని వచ్చిన ప్రశ్నకు మాళవిక మోహనన్ సమాధానం ఇచ్చారు. గ్యాంగ్‍స్టర్ పాత్రలో నటించాలని ఉందని తెలిపారు. ఫైట్, డ్యాన్స్‌లో ఏది ఇష్టమంటే.. ఫైటే అని రాసుకొచ్చారు.
ఇతర గ్యాలరీలు