Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడిన 8 మంది పాపులర్ సెలెబ్రిటీలు-mahima chaudhry to mumtaj 8 popular celebrities who fought breast cancer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడిన 8 మంది పాపులర్ సెలెబ్రిటీలు

Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడిన 8 మంది పాపులర్ సెలెబ్రిటీలు

Jun 29, 2024, 04:27 PM IST Chatakonda Krishna Prakash
Jun 29, 2024, 04:24 PM , IST

Breast Cancer: తాను రొమ్ము క్యాన్సర్ (బ్రెస్ట్ క్యాన్సర్)తో బాధపడుతున్నానని టీవీ నటి హీనా ఖాన్ తాజాగా ప్రకటించారు. గతంలో రొమ్ము క్యాన్సర్‌తో పోరాడిన 8 మంది ఫేమస్ సెలెబ్రిటీలు వీరే.

తాను స్టేజ్-3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని హిందీ ప్రముఖ టీవీ యాంకర్ హీనా ఖాన్ తాజాగా వెల్లడించారు. తనకు చికిత్స బాగానే జరుగుతుందని ఇన్‍స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. క్యాన్సర్ నుంచి బయటపడేందుకు పూర్తిస్థాయిలో ట్రీట్‍మెంట్ జరుగుతోందని తెలిపారు. కాగా, చాలా మంది సెలెబ్రెటీలు కూడా తాము రొమ్ము క్యాన్సర్‌తో పోరాడామని గతంలో వెల్లడించారు. అందులో మహిమా చౌదరి కూడా ఉన్నారు. తాను 2022లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడినట్టు మహిమ వెల్లడించారు. ఆమె చికిత్స కూడా పూర్తయింది. 

(1 / 8)

ఆయుష్మాన్ ఖురానా భార్య, ఫిల్మ్ మేకర్ తాహిరా కశ్యప్‍ను స్టేజ్ 0 బ్రెస్ట్ క్యానర్‌తో బాధపడుతున్నట్టు 2018లో వెల్లడించారు. 

(2 / 8)

టీవీ నటి చావి మిట్టల్ 2022లో రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ సమస్యను వైద్యులు త్వరలోనే గుర్తించినందుకు అదృష్టవంతురాలినని అప్పట్లో ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. ఆమె ఈ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. మహిళల ఈ విషయంపై అవగాహన కల్పించే చర్యలు కూడా చేస్తున్నారు. 

(3 / 8)

గతేడాది తాను  బ్రెస్ట్ క్యాన్సర్ కోసం చికిత్స తీసుకున్నానని హాలీవుడ్ నటి ఒలివియా మన్ ఇటీవలే తెలిపారు. తనకు వైద్యం చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు చెప్పారు. 

(4 / 8)

ఆస్ట్రేలియన్ పాప్ స్టార్ కైలీ మినోగ్యూ 2005లో ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌కు చికిత్స పొందారు. నాలుగు రోజుల చికిత్స తర్వాత తనకు సర్జరీ జరిగిందని, ఆ తర్వాత కీమోథెరపి మొదలైందని వెల్లడించారు. 

(5 / 8)

గ్రామీ అవార్డు విన్నింగ్ మ్యూజిషియన్ షెరిల్ క్రో 2006లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించాల్సిన అవసరం గురించి ఆమె చాలాసార్లు మాట్లాడారు. మమ్మోగ్రామ్ చేయించుకోని కారణంగా తాను చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఈమె జీవితంపై షెరిల్ అనే డాక్యుమెంటరీ కూడా 2022లో వచ్చింది. 

(6 / 8)

హాలీవుడ్ స్టార్ సింతియా నిక్సాన్ 2002లో లంపెక్టమీ, రేడియేషన్ చికిత్సలు తీసుకున్నారు. ఆమె తల్లి కూడా గతంలో రొమ్ము క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. సుసాన్ జీ కొమెన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్‍కు నిక్సాన్ బ్రాండ్ అంబాసిడార్ కూడా అయ్యారు. 

(7 / 8)

సీనియర్ నటి ముంతాజ్ 2002లో రొమ్ము క్యాన్సర్‌కు వైద్యం తీసుకున్నారు. ఆరు కీమోథెరపీలు, 35 రేడియేషన్ చికిత్సలతో ఆమె ఆ వ్యాధిపై పోరాడారు. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు