Mahesh Babu: ‘ఎప్పటికీ నీతోనే’: భార్యకు పెళ్లి రోజు విషెస్ చెప్పిన మహేశ్ బాబు
- Mahesh Babu - Namrata Shirodkar: మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ వివాహ బంధానికి నేటి (ఫిబ్రవరి 10)తో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భార్యకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సూపర్ స్టార్.
- Mahesh Babu - Namrata Shirodkar: మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ వివాహ బంధానికి నేటి (ఫిబ్రవరి 10)తో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భార్యకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సూపర్ స్టార్.
(1 / 5)
సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమత్రా శిరోద్కర్ నేడు తమ 20 ఏళ్ల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అన్యూన్యమైన జంటగా పేరున్న ఈ స్టార్ కపుల్ చాలా మందికి స్ఫూర్తిగా ఉంటున్నారు. నేడు వివాహ వార్షికోత్సవం సందర్భంగా మహేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
(2 / 5)
వంశీ సినిమా షూటింగ్ సందర్భంగా మహేశ్, నమత్రాకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. 2005 ఫిబ్రవరి 10వ తేదీన వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నేటితో వీరి వివాహ బంధం 20 ఏళ్లకు చేరుకుంది.
(3 / 5)
మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా నేడు (ఫిబ్రవరి 10) తన భార్య నమత్రకు ఇన్‍స్టాగ్రామ్ వేదికగా విషెస్ చెప్పారు మహేశ్ బాబు. “నువ్వు, నేను.. 20 అందమైన సంవత్సరాలు. ఎప్పటికీ నీతోనే ఎన్‍ఎస్‍జీ (నమత్రా శిరోద్కర్ ఘట్టమనేని)” అని క్యాప్షన్ రాశారు మహేశ్. రెండు లవ్ సింబల్స్ కూడా పెట్టారు.
(4 / 5)
తాను, నమత్ర హాయిగా నవ్వుకుంటున్న ఓ ఫొటోను మహేశ్ బాబు షేర్ చేశారు. ఈ స్టార్ జంటకు అభిమానులు భారీగా శుభాకాంక్షలు చెబుతున్నారు. కామెంట్ల వర్షం కురుస్తోంది. మహేశ్, నమ్రత దంపతులకు కొడుకు గౌతమ్ కృష్ణ, కూతురు సితార ఉన్నారు.
ఇతర గ్యాలరీలు