MS Dhoni Record: చరిత్ర సృష్టించిన ధోనీ.. ఐపీఎల్‍లో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా..
- MS Dhoni Record: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి అరుదైన రికార్డు సాధించాడు. పంజాబ్‍తో నేడు (మే 5) జరిగిన మ్యాచ్ ద్వారా ఓ రికార్డు సృష్టించాడు. ఆ వివరాలివే..
- MS Dhoni Record: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి అరుదైన రికార్డు సాధించాడు. పంజాబ్‍తో నేడు (మే 5) జరిగిన మ్యాచ్ ద్వారా ఓ రికార్డు సృష్టించాడు. ఆ వివరాలివే..
(1 / 5)
ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (మే 5) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు 28 పరుగుల భారీ తేడాతో పంజాబ్ కింగ్స్ (PBKS)పై విజయం సాధించింది. ధర్మశాల వేదికగా జరిగిన పోరులో చెన్నై దుమ్మురేపింది. అయితే, ఈ మ్యాచ్‍లో ఓ క్యాచ్ ద్వారా సీఎస్‍కే స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
(AFP)(2 / 5)
ఐపీఎల్‍లో 150 క్యాచ్‍లు పట్టిన తొలి ప్లేయర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‍లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
(ANI )(3 / 5)
పంజాబ్‍తో మ్యాచ్‍లో జితేశ్ శర్మ క్యాట్ పట్టాడు ధోనీ. దీంతో ఐపీఎల్‍లో 150 క్యాచ్‍లను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‍లో ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ప్లేయర్‌గా రికార్డు దక్కించున్నాడు.
(AP)(4 / 5)
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‍ల జాబితాలో ధోనీ (150 క్యాచ్‍లు) తర్వాత రెండో స్థానంలో ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ 144 క్యాచ్‍లతో ఉన్నాడు. ఆ తర్వాతి ప్లేస్‍ల్లో ఏబీ డెవిలియర్స్ (118 క్యాచ్‍లు, రిటైర్డ్), ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (113 క్యాచ్‍లు), సురేశ్ రైనా (109 క్యాచ్‍లు, రిటైర్డ్) ఉన్నారు.
(IPL)ఇతర గ్యాలరీలు