తెలుగు న్యూస్ / ఫోటో /
Womens Day Special: తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఇవే - కీర్తి సురేష్ టాప్
Womens Day Special: తెలుగులో సమంత, అనుష్కతో పాటు కీర్తిసురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ ఫైవ్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఏవంటే?
(1 / 5)
టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లిస్ట్‌లో మహానటి టాప్ ప్లేస్‌లో ఉంది. కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ 86 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అలనాటి దిగ్గజ హీరోయిన్ సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీగా రికార్డ్ నెలకొల్పింది
(2 / 5)
అనుష్క హీరోయిన్‌గా నటించిన రుద్రమదేవి 80 కోట్ల కలెక్షన్స్ తో అత్యధిక వసూళ్లను రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. రుద్రమదేవి సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు.
(3 / 5)
అనుష్కకు స్టార్‌డమ్‌ను తీసుకొచ్చిన సినిమాల్లో అరుంధతి ఒకటి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ 70 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. మహానటి, రుద్రమదేవి తర్వాత తెలుగులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీగా అరుంధతి నిలిచింది.
(4 / 5)
కమర్షియల్ హీరోయిన్‌గా రాణిస్తోన్న సమంత ఓ బేబీ మూవీతో లేడీ ఓరియెంటెడ్ జోనర్‌లోకి అడుగుపెట్టింది. కొరియన్ మూవీ రీమేక్‌గా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామా మూవీ 35 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
ఇతర గ్యాలరీలు