తెలుగు న్యూస్ / ఫోటో /
Mahalaya Amavasya 2022 | నేడు పవిత్రమైన పితృ అమావాస్య.. చాలా ప్రత్యేకమైన రోజు!
- నేడు పెద్దలను ఆరాధించే అమావాస్య. దీనినే మహాలయ అమావాస్య, పెత్తర అమావాస్య అంటారు. నేటితో పితృపక్షం, భాద్రపదమాసం ముగిసిపోతుంది. ఇది దేవీ పక్షం, ఆయ్వయుజ మాసం ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న మహాలయ అమావాస్య వచ్చింది.

(1 / 8)
బెంగాల్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో 10 రోజుల పాటు జరిగే దుర్గాపూజ పండుగ మహాలయతో ప్రారంభమవుతుంది.(Unsplash)
(2 / 8)
హిందూ క్యాలెండర్ ప్రకారం, మహాలయ అమావాస్య పితృ పక్షం ముగింపును, అలాగే దేవీ పక్షం ప్రారంభాన్ని సూచిస్తుంది. దుర్గా పూజకు ఒక వారం ముందు మహాలయ వేడుకలు ప్రారంభమవుతాయి.(HT Photo/Samir Jana)
(3 / 8)
ఈ మహాలయ రోజునే దుర్గా దేవి కైలాస పర్వతం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని నమ్ముతారు.(PTI)
(4 / 8)
మహాలయ రోజున, బెంగాలీలు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజలు చేస్తారు.(Subhendu Sarkar/Getty Images)
(5 / 8)
ఈరోజున హిందువులు పితృ తర్పణ ఆచారాన్ని పాటిస్తారు. ఇందులో భాగంగా గతించిన వారి పూర్వీకుల కోసం ప్రత్యేక పూజలు, నదిలో పిండ ప్రదానాలు చేస్తారు.
(6 / 8)
మరణించిన వారి ఆత్మశాంతి కోసం వారి కుటుంబీకులు తర్పణం అందిస్తారు. బ్రాహ్మణులకు బియ్యం, ఇతర సామాగ్రిని అందిస్తారు. పేదలకు దానధర్మాలు చేస్తారు.(AP photo)
ఇతర గ్యాలరీలు