TTD Temple: చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం.. వైభవంగా 'మహాకుంభాభిషేకం'
TTD temple inaugurated in Chennai: చెన్నైలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి పాల్గొన్నారు.
(1 / 4)
శుక్రవారం ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విశ్వక్సేనారాధన, చతుష్టార్చన, బలిహరణ, గోష్టి, బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, మహా పూర్ణాహుతి, ప్రాయశ్చిత్త హోమాలు, శాంతిహోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. (twitter)
(2 / 4)
కుంభ ప్రోక్షణ, విమాన, రాజగోపురానికి కుంభ ప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ట, హారతి కార్యక్రమాల తర్వాత శ్రీ పద్మావతి శ్రీనివాసుల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు. (twitter)
(3 / 4)
ఈ మహా కుంభాభిషేకంలో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి పాల్గొన్నారు. మహా కుంభాభిషేకం నిర్వహణ పట్ల టీటీడీని అభినందించారు.(twitter)
(4 / 4)
చెన్నయ్ టీ నగర్‌లో టీటీడీ నిర్మించిన ఈ పద్మావతి అమ్మవారి ఆలయానికి సినీ నటి కాంచన.. స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. దీని విలువ సుమారు రూ. 40కోట్ల వరకు ఉంటుంది. ఇక రూ.10 కోట్లతో టీటీడీ ఈ ఆలయ నిర్మాణం చేపట్టింది. చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి, సభ్యులు స్మిత ఇతర సభ్యుల ఆధ్వర్యంలో రూ.5 కోట్లతో గాలిగోపురం, కలశాలు ఏర్పాటు చేశారు. (twitter)
ఇతర గ్యాలరీలు