(1 / 6)
ఈ సంవత్సరం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతుంది. ఈ సమయంలో ప్రపంచం నలుమూలల నుండి భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. సుమారు నెల రోజుల పాటు సాధువులు, భక్తులు ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకుంటారు.
(AFP)(2 / 6)
కుంభమేళాలో నాగ సాధువులు స్పెషల్ అట్రాక్షన్. నాగ సాధువులు మహాకుంభంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అమృత స్నానం జరిగినప్పుడల్లా సాధువులు మొదట నదిలో స్నానం చేస్తారు. అయితే నాగ సాధువులు 16 కాదు 17 రకాల అలంకరణలు చేస్తారు.
(3 / 6)
నాగ సాధువులు ప్రాపంచిక బంధాల నుంచి విముక్తి పొందినా మేకప్ ను ఎప్పుడూ వదులుకోరు. అమృత స్నానానికి వెళ్లినప్పుడు పూర్తి 17 రకాల మేకప్ వేసుకుంటారు.
(4 / 6)
తిలకం, కాజల్, పూల దండ, బూడిద ముఖ్యమైన అలంకరణలు. నాగ సాధువులు తరచుగా నుదుటిపై పొడవైన తిలకాన్ని పూస్తారు. ఇది శివ భక్తికి చిహ్నంగా భావిస్తారు. కళ్ళకు కాజల్ లేదా సుర్మా పూస్తారు, నడుము చుట్టూ పూలదండలు వేసుకుంటారు.
(AP)(5 / 6)
నాగ సాధువుల 17 అలంకరణలలో బూడిద, చందనం, చిన్న బట్ట, కాళ్లకు ధరించేందుకు వెండి లేదా ఐరన్ కడియాలు, కుంకుమ, ఉంగరం, పంచకేశ(జడ ఐదుసార్లు చుట్టడం), పూల దండ, చేతుల్లో పటకారు వంటి ఆయుధం, కమండలం, ఢమరు, జడలు, తిలకం, మసి బొట్టు, విభూతి, రుద్రాక్ష, చేతిలో జపమాల ఉన్నాయి. నాగ సాధువులు తమ జుట్టును సాధారణ పద్ధతిలో కట్టుకోరు. 5 సార్లు చుట్టుకుంటారు. ఇది పంచతత్వానికి చిహ్నంగా భావిస్తారు. నాగ సాధువులు నుదుటిపై కుంకును పెట్టుకుంటారు. వీటిని సూర్యచంద్రుల చిహ్నాలుగా భావిస్తారు.
(6 / 6)
2025 జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా 44 రోజుల పాటు కొనసాగుతుందని. మహాశివరాత్రి పర్వదినమైన ఫిబ్రవరి 26న అంతిమ స్నానం జరుగుతుంది. మహాకుంభంలో స్నానమాచరించడానికి ఈ ఏడాది సుమారు 35-40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారని అంచనా.
(Utpal Sarkar)ఇతర గ్యాలరీలు