తెలుగు న్యూస్ / ఫోటో /
Maha Kumbh Mela: మహా కుంభమేళాలో పాల్గొనడానికి వచ్చేస్తున్న భక్తుల కోసం సిద్ధమైన ప్రయాగరాజ్
Maha Kumbh Mela photos: మహా కుంభమేళాలో పాల్గొనడానికి వచ్చేస్తున్న భక్తుల కోసం ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మహా కుంభమేళాలో పాల్గొనడం కోసం వివిధ అఖాడాలకు చెందిన సాధువులు రావడం ఇప్పటికే ప్రారంభమైంది.
(1 / 9)
ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే "మహా కుంభమేళా"లో పాల్గొనడం కోసం వస్తున్న నిరంజని అఖారా సాధువులకు స్వాగతం పలుకుతూ నృత్యం చేస్తున్న సాధువులు(REUTERS)
(2 / 9)
మహా కుంభమేళాలో పాల్గొనడం కోసం ప్రయాగరాజ్ వస్తున్న 'శ్రీ తపోనిధి ఆనంద్ అఖారా పంచాయితీ'కి చెందిన 'సాధువులు.(PTI)
(3 / 9)
మహా కుంభమేళా 2025 కోసం 'సాధులు' మరియు 'అఖారా' లేదా శాఖలోని ఇతర సభ్యుల రాకను సూచించే 'పేష్వాయి' ఊరేగింపులో పాల్గొన్న 'శ్రీ తపోనిధి ఆనంద్ అఖారా పంచాయతీ'కి చెందిన నాగ సాధువులు. (Rameshwar Gaur)
(4 / 9)
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఉత్సవాలకు ముందు పొగమంచుతో కూడిన శీతాకాల సాయంత్రం గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద బోట్ రైడ్ చేస్తున్న సందర్శకులు(PTI)
(5 / 9)
‘మహా కుంభమేళా 2025 కోసం రాజ ప్రవేశ ఊరేగింపు ‘చావ్నీ ప్రవేశ్’ జరుపుతున్న శ్రీ తపోనిధి ఆనంద్ అఖారా పంచాయతీ'కి చెందిన సాధువులు(PTI)
(6 / 9)
ప్రయాగ్‌రాజ్‌లో సంప్రదాయబద్ధంగా కరవాలం చేతబట్టి మహా కుంభమేళా 2025కి వస్తున్న 'శ్రీ తపోనిధి ఆనంద్ అఖారా పంచాయతీ'కి చెందిన ఒక సాధువు.(PTI)
(7 / 9)
మహా కుంభమేళా కోసం వస్తున్న భక్తుల కోసం నది ఒడ్డున సిద్ధంగా ఉన్న గోపురం ఆకారపు విశ్రాంతి ప్రదేశంతో కూడిన విలాసవంతమైన కాటేజ్. ఇక్కడ మామూలు రోజుల్లో ఒక రోజుకు రూ. 80 వేలు, కుంభమేళా జరిగే ప్రధాన రోజుల్లో రూ. 1.10 లక్షలు చెల్లించాలి.(HT_PRINT)
ఇతర గ్యాలరీలు